సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న బిగ్ బాస్.. సీజన్ 6 లో యాంకర్ ..?

ఇప్పటివరకు బుల్లితెర మీద ప్రసారమైన రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న ప్రేక్షకఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు బుల్లితెర మీద ప్రసారమైన ఐదు సీజన్లు టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయాయి. ఇటీవల
ఓటిటి లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ కూడా మంచి రేటింగ్స్ సంపాదించుకుంది. ఇదిలా ఉండగా చాలా కాలంగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ప్రసారమైన బిగ్ బాస్ సీజన్లలో సినిమా, సీరియల్స్ సెలబ్రిటీలు యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన వారు పాల్గొనేవారు. కానీ ఈ సీజన్లో మాత్రం సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు నాగార్జున ప్రకటించాడు.

దీంతో ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సీజన్ సిక్స్ లో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వాటిలో ఎంతవరకు నిజం అన్న సంగతి క్లారిటీ లేదు. తాజాగా బిగ్ బాస్ 6లో పాల్గొన్నబోయే కంటెస్టెంట్ అంటూ ఒక యాంకర్ పేరు వినిపిస్తోంది. సాధారణంగా ప్రతి బిగ్ బాస్ సీజన్ లో యాంకర్ కచ్చితంగా ఉంటారు. అందువల్ల ఈ సీజన్ సిక్స్ లో కూడా కచ్చితంగా ఒక యాంకర్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడుతుందని అందరికీ అర్థమైపోయింది. ఈ క్రమంలో టీవీ9లో ఇస్మార్ట్ న్యూస్ తో సందడి చేసే యాంకర్ అంజలి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే బిగ్ బాస్ మొదటినుంచి ఒక సెంటిమెంట్ ఫాలో అవుతూ వస్తోంది. ఇప్పటివరకు టీవీ9 నుండి ఎంతోమంది యాంకర్లు బిగ్ బాస్ లో పాల్గొన్నారు. దీప్తి , జాఫర్, దేవీ నాగవల్లి వంటి వారందరూ టీవీ9లో యాంకర్లుగా పనిచేశారు దీంతో ఇదే సెంటిమెంట్ గా భావించి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కూడా టీవీ9 యాంకర్ ని కంటెస్టెంట్ గా పంపుతున్నారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ న్యూస్ తో అందరినీ ఆకట్టుకున్న యాంకర్ అంజలి ని సీజన్ 6 కోసం సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే ఈ సీజన్ ప్రారంభమయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉండగా వచ్చేనెల రెండవ వారంలో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానున్నట్లు సమాచారం.