ఆమ్మో.. అర్జె కాజల్ కు అన్నీ లక్షల రెమ్యూనరేషనా?

తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ కాజల్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.బిగ్ కాజల్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి ఎన్నో రకాల పరీక్షలను ఎదుర్కొంది. మొదట్లో లేడి నారదుడిగా పేరు తెచ్చుకుంది. ఆ తరువాత అందరితోనూ గొడవ పడుతుంటే స్క్రీన్ స్పేస్ కోసం అంటూ ఆమెను తప్పుబట్టారు. అలాగే బిగ్ బాస్ అనేది తన డ్రీమ్ అంటూ ప్రతి విషయాన్ని ఎగ్జైట్ అవ్వడంతో ఆ విషయం పట్ల కూడా ఆమె తప్పు పట్టారు. ఇలా ఎవరు ఏమన్నా కూడా కాజల్ పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగా గేమ్ ఆడుతూ వచ్చింది.

సగం వరకు ఎవరికీ నచ్చకుండా ఒంటరిగా గేమ్ ఆడిన కాజల్ ఆ తరువాత సన్నీ, మానస్ లతో మంచి దోస్తీ కుదిరింది. ఇక సన్నీకి కాజల్ క్లోజ్ అవడమే కాకుండా సన్నీకి ఏఫిక్షన్ ఫ్రీ పాస్ రావడానికి కూడా ముఖ్య కారణం అయ్యింది. ఇలా ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాజల్ ఎమోషనల్ అవ్వకుండా చిరునవ్వుతో వాటిని స్వీకరించే మనసుకు ఎంతో మంది ఫిదా అయ్యారు.

కానీ కాజల్ కు ఫ్యాన్ బేస్ తక్కువగా ఉండటంతో నామినేషన్స్ లో ఉన్నవారికి కంటే తక్కువ ఓట్లు నమోదు అవడంతో తాజాగా 14వ వారం ఎలిమినేట్ అయిన బయటకు వచ్చేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ హౌస్ లో 14 వారాల కాజల్ కి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాజల్ కు వారానికి రెండు లక్షల పైనే పారితోషికం అందించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకారంగా చూసుకుంటే 14 వారాలకు గానీ కాజల్ దాదాపుగా 30 లక్షల వరకు వెనకేసుకు నట్లు తెలుస్తోంది. ఈమె తనకున్న 30 లక్షల అప్పును ఈ రెమ్యూనరేషన్ తో వదిలించుకునే అవకాశం ఉంది.