Bigg Boss Telugu : తెలుగు “బిగ్ బాస్” వీక్షకులకు బిగ్గెస్ట్ అప్డేట్ ఏమిటంటే!

Bigg Boss Telugu : ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ఆదరణ ఉన్న ఏకైక టెలివిజన్ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ అని చెప్పాలి. మొదట ఇంగ్లీష్ లో స్టార్ట్ అయ్యి సక్సెస్ అయ్యాక మన ఇండియన్ భాషల్లో కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇండియాలో ఎప్పుడు అయితే తెలుగులో షో స్టార్ట్ అయ్యిందో అన్ని భాషల రేటింగ్స్ ని బ్రేక్ చేస్తూ తెలుగు షో మాత్రమే నెంబర్ 1 స్థానంలో నిలిచింది.

ఇలా మొత్తం ఐదు సీజన్లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న ఈ గ్రాండ్ రియాలిటీ షో రీసెంట్ గానే 5వ సీజన్ ని పూర్తి చేసుకుందో లేదో ఇప్పుడు ఇంకో బిగ్గెస్ట్ అనౌన్సమెంట్ ఈ షో వీక్షకులకు వచ్చింది. కాకపోతే ఇది టెలివిజన్ కి కాదట ఓటిటి లో ఈసారి బిగ్ బాస్ షో ని ప్లాన్ చేస్తున్నారట. ఇదే స్టార్ మా హాట్ స్టార్ట్ యాజమాన్యం ఈ విషయాన్ని వెల్లడించారు.

అప్పుడే అయ్యిపోలేదు ఇంకా చాలా ఉంది. ఈ ఓటిటి బిగ్ బాస్ కి కూడా నాగార్జున తోనే హోస్టింగ్ చేయించనున్నారట. అలాగే టీవిలో లా కాకుండా ఇది 24 గంటలు స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుందట అప్పుడు కంటెస్టెంట్స్ పై ఆడియెన్స్ లో కూడా ఇంకా ఎక్కువ నిఘా ఉంటుంది. మొత్తానికి అయితే ఈరోజు ఈ బిగ్ అప్డేట్ రివీల్ అయ్యింది. ఇంకా షో ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అనేవి తెలియాల్సి ఉన్నాయి.