Big Boss Non Stop Telugu: ఫ్యామిలీ ఎపిసోడ్ లో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న షణ్ముఖ్ జస్వంత్… ఎవరికోసమంటే?

Big Boss Non Stop Telugu: బిగ్ బాస్ కార్యక్రమంలో ఫ్యామిలీ ఎపిసోడ్ ఉండడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల ఫ్యామిలీ, ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వారికి సపోర్ట్ చేస్తూ వారిలో కొంత పాజిటివిటిని కల్పిస్తూ వస్తారు. ఇలా ప్రతి సీజన్ లో ఫ్యామిలీ మెంబర్స్ రావడం సర్వసాధారణం. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ లో ప్రసారమౌతున్న కార్యక్రమంలో భాగంగా 10 మంది కంటెస్టెంట్ లు ఉండటంతో ఈ కార్యక్రమంలో కూడా ఫ్యామిలీ ఎపిసోడ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల కోసం వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రన్నర్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే షణ్ముక్ ఎవరిని సపోర్ట్ చేయడానికి బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్నాడనే విషయానికి వస్తే…యూట్యూబ్ యాంకర్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ శివ కోసం షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్నారు. అదేవిధంగా అఖిల్ కోసం గంగవ్వ, ఆశు కోసం జశ్వంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారు. ఇకపోతే ఆరియనా కోసం అవినాష్, హమీదా కోసం శ్రీరామచంద్ర వెళ్లనున్నారు.

నటరాజ్ మాస్టర్ కోసం తన భార్య బిందు మాధవి తల్లి, మిత్ర కోసం తన ఫ్రెండ్స్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వెళ్లి కంటెస్టెంట్ లకు మరింత ఎనర్జీ ఇవ్వనున్నారు.ఇకపోతే ఈ వారం కూడా నామినేషన్ లో ఏడుగురు కంటెస్టెంట్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఎప్పటి నుంచో నటరాజ్ మాస్టర్ నామినేషన్స్ లో ఉంటే తనని బయటికి పంపించాలని ఎంతోమంది కాచుకు కూర్చున్నారు.మరి ఈ వారం నామినేషన్ లో ఉన్నటువంటి నటరాజ్ మాస్టర్ తప్పనిసరిగా బయటకు వస్తారని సోషల్ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. మరి ఈ వారం బిగ్ బాస్ నుంచి నటరాజ్ మాస్టర్ బయటకు వస్తారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.