ఈ నెల 9నుండి “యాంగర్ టేల్స్” ప్రీ రిలీజ్ వేడుక లో టీమ్.

సుహాస్, తరుణ్ భాస్కర్, బిందు మాధవి, మడోన్నా సెబాస్టియన్, రవింద్ర విజయ్, వెంకటేష్ మహా, ఫణి ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ యాంగర్ టేల్స్. ఫ్యాన్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై.. నాలుగు భిన్నమైన కథలతో రూపొందిన ఈ ఆంథాలజీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 9నుంచి స్ట్రీమ్ కాబోతోంది. నితిన్ ప్రభల తిలక్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ కు సంబంధించిన నాలుగు కథలకు నలుగురు సినిమాటోగ్రాఫర్స్ పనిచేయడం విశేషం. ఈ సందర్భంగా ఈ సిరీస్ కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దర్శకుడు నితిన్ ఈ కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఈ సిరీస్ నిర్మాణంలో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ అంతా బాగా కోపరేట్ చేశారు. షూటింగ్ అంతా చాలా కూల్ గా సాగిపోయింది. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కథలతో వస్తాం’అన్నారు.

రచయిత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తికేయ మాట్లాడుతూ.. ‘మొదట్లో చాలా భయపడ్డాం. ఈ సిరీస్ చేయడం కష్టమేమో అనుకున్నాం. కానీ మేం కొత్త టీమ్ అయినా ప్రతి ఒక్కరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ కథలు ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.’ అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ.. ‘ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్ చెబుతున్నాను. టెక్నీషియన్స్ అంతా ది బెస్ట్ ఇచ్చారు. ప్రతి ఆర్టిస్ట్ అద్భుతంగా నటించారు. అందరి నటనకూ నేను ఫిదా అయ్యాను. ఇంతమంచి యంగ్ టీమ్ తో పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది..’ అన్నారు.

యాంగర్ టేల్స్ సిరీస్ తో నటుడుగా పరిచయం అవుతోన్న ఫణి ఆచార్య మాట్లాడుతూ .. ‘చిన్నప్పటి నుంచి నటుడు కావాలనేది నా కల. ఆ కల ఇలా నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీ అందరి ముందూ మాట్లాడటం ఓ కలలా ఉంది. నిర్మాత శ్రీధర్ గారితో పాటు నితిన్, సుహాస్, కార్తికేయ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే తరుణ్ భాస్కర్, మడోన్నా గారికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ సిరీస్ తో బిందు మాధవి లాంటి మంచి ఫ్రెండ్ దొరికింది..’ అన్నారు.

దర్శకుడు నుంచి నటుడుగా మారిన వెంకటేష్ మహా మాట్లాడుతూ .. ‘అందరికీ నమస్కారం. నాకు తెలిసి ఇది ఓ ట్రెడిషనల్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనుకుంటున్నాను. నితిన్ ఈ కథ చెప్పాలని వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను రంగా పాత్ర చేయాలని ఆ కథ చెప్పాడు. నేను కేవలం రెండు నిమిషాల్లోనే ఎస్ చెప్పాను. ఈ పాత్ర నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఈ పాత్ర ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. మొదట్లో క్యారెక్టరైజేషన్ గురించి కొంచెం వేరుగా అనిపించినా.. నితిన్ ఏంటో అర్థమైన తర్వాత పూర్తిగా అతనికి సరెండర్ అయిపోయాను. దర్శకుడుగా నేను సీనియర్ అని కాకుండా రంగా పాత్రలో ఆగిపోయాను. ఈ పాత్రలో నా నటన అంతా నితిన్ విజన్ గానే చెబుతాను. నాకు ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. నా కథ కాకుండా నాకు బాగా నచ్చింది బిందు మాధవి నటించిన రాధ కథ. ఈ రెండు కథలు చూసిన తర్వాత ది బెస్ట్ ఇచ్చామనే అనుకున్నాను. సుహాస్ కు పాత్ర గురించి చెబితే చాలు.. పాత్రలో జీవించేస్తాడు. ఈ మధ్య కలర్ ఫోటో మూవీతో అందరికీ ఫేవరెట్ అయిపోయాడు. మా కాంబినేషన్ లో కూడా మరో సినిమా రాబోతోంది. ఈ సిరీస్ కు మ్యూజిక్ అందించిన స్మరణ్ పేరు గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో తనదైన ముద్రను వేస్తాడు. ప్రొడ్యూసర్ శ్రీధర్ కు థ్యాంక్ యూ. ప్రొడక్షన్ ను చాలా గొప్పగా చేశారు. రాబోయే రోజుల్లో ఫ్యాన్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్ నుంచి గొప్ప సినిమాలు వస్తాయని చెప్పగలను. ఇలాంటి ఓ సీరీస్ ను తీసుకున్నందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ టీమ్ మొత్తానికి ధన్యవాదాలు చెబుతున్నాను. సిరీస్ కు అద్భుతమైన ప్రమోషన్స్ ను చేశారు. మిగతా పాత్రలు చేసిన వారంతా అద్భుతంగా నటించారు.. ’ అని చెప్పారు.

రాధ పాత్రలో నటించిన బిందు మాధవి మాట్లాడుతూ.. ‘ఈ మధ్య నేను ఏమనుకున్నా జరిగిపోతున్నాయి. అలాగే ఈ సీరీస్ కూడా మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కమల్ హాసన్ గారు చెప్పిన మాట గుర్తొస్తోంది. యాంగర్ అనే విషయాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించకపోవడమే నేరం. అన్నట్టుగా.. ఈ ఆంథాలజీలో కూడా ఆ యాంగర్ గురించే చెప్పారు. ఇంత మంచి కథ, పాత్రకు నన్ను అనుకున్నందుకు నితిన్ కు చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. నిర్మాతలతో పాటు తోటి ఆర్టిస్టులంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంతమంచి టీమ్ తో అసోసియేట్ అయినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను.. ’అన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఈ టీమ్ అంతా మా వాళ్లే. నితిన్ నేను గతంలో ఓ వెబ్ సిరీస్ కు పనిచేశాం. తను మంచి రచయిత. కలర్ ఫోటోకు తను రైటర్ గా పనిచేశాడు. మా అందరికంటే ముందే దర్శకుడు కావాలన్న క్లారిటీ ఉన్న వ్యక్తి నితిన్. ఐదేళ్లుగా ఈ ఆంథాలజీపై పని చేస్తున్నాడు. ఫైనల్ గా నేను చూసిన తర్వాత అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు. నాలుగు కథలూ చాలా బావున్నాయి. రాధ అనే పాత్రతో నేను బాగా కనెక్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ ఆంథాలజీ హైలెట్ అవుతుందనుకుంటున్నాను. డెబ్యూ మూవీతోనే తన మేకోవర్ తో సర్ ప్రైజ్ చేశాడు ఫణి ఆచార్య. అతని నటన అద్భుతంగా ఉంది. చివరి ఎపిసోడ్ గా వచ్చే తరుణ్ భాస్కర్ కథ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్ ల కంటే యంగర్ టేల్స్ ఖచ్చితంగా ది బెస్ట్ అనేలా ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. ప్రొడ్యూసర్ శ్రీధర్ అన్ని విభాగాల్లో పట్టు తెచ్చుకుంటూ ఇప్పుడు నిర్మాత అయ్యాడు. త్వరలోనే దర్శకుడూ అవుతాడనుకుంటున్నాను. అలాగే ఈ సిరీస్ మీ అందరికీ బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని చెప్పగలను.. ’ అన్నారు.

చాయ్ బిస్కట్ తో మెప్పించి మేజర్, రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో మెప్పించిన నిర్మాత శరత్ మాట్లాడుతూ.. ‘ఇక్కడున్న చాలామందితో కలిసి ఓ ఐదారేళ్ల క్రితం చాయ్ బిస్కట్ లో కలిసి పనిచేశాం. టీమ్ అంతా ప్యాషనేట్ గా కనిపించింది. చాలా కష్టపడి పనిచేశారు. నితిన్ ఇంత మంచి ప్రాజెక్ట్ తో వచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేస్తాడు అనకోలేదు. ఈ సందర్భంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్.. ’ అన్నారు.

చాలా తక్కువ టైమ్ లో స్టార్ గా ఎదిగిన సుహాస్ మాట్లాడుతూ .. ‘అందరికీ నమస్కారం. నితిన్ నాతో కళాకారుడు అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. ప్రొడ్యూసర్ శ్రీధర్ కూడా ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు అందరం కలిసి తలా కొంచెం డబ్బులు వేసుకుని ఈ సీరీస్ తీశాం. మాకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్లు చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చారు. మా టెక్నీకల్ టీమ్ అందరికీ థ్యాంక్యూ. మా దర్శకుడు నితిన్ మిమ్మల్ని ఎప్పుడూ నిరాశపచడు. ఈ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరూ ఆపరు. ఆ స్థాయిలో తీశాడు నితిన్. రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు ఇస్తాడు అని చెప్పగలను..’ అని చెప్పారు.

దర్శకుడు ప్రభల నితిన్ తిలక్ మాట్లాడుతూ.. ‘నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన వారితో పాటు ఆర్టిస్టులందరితో పాటు మొత్తం టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నాను. అనురాగ్, శరత్ గారికి థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఓ మంచి సినిమా చేశాం. ఆంథాలజీ కాబట్టి నీరసంగా ఏం ఉండదు. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను..’ అన్నారు.

రైటర్ పద్మభూషణ్ దర్శకుడు షన్ముఖ్ ప్రశాంత్ యాంగర్ టేల్స్ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నాలుగు కథల సమాహారంగా వస్తోన్న ఈ ఆంథాలజీ మార్చి 9 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోంది.

నటీ నటులు : సుహాస్, తరుణ్ భాస్కర్, మడోన్నా సెబాస్టియన్, వెంకటేష్ మహా, బిందు మాధవి, రవీంద్ర విజయ్, ఫణి ఆచార్య తదితరులు.

టెక్నీషియన్స్ :
కెమెరామెన్ : అమర్ దీప్, వినోద్ కె బంగారి, వెంకట్ ఆర్ శాఖమూరి, ఏజే ఆరోన్,
సంగీతం : స్మరణ్ సాయి,
ప్రొడక్షన్ డిజైనర్ : అశోక్ నర్రా,
కో ప్రొడ్యూసర్ : కృష్ణం గడసు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కార్తికేయ కారెడ్ల,
రయితలు : కార్తికేయ కారెడ్ల, నితిన్ ప్రభల తిలక్,
నిర్మాతలు : శ్రీధర్ రెడ్డి, సుహాస్,
దర్శకత్వం : నితిన్ ప్రభల తిలక్,
పిఆర్ఓ : జిఎస్కే మీడియా.