Big Boss Non Stop Winner: బిగ్ బాస్ విన్నర్ ఆమే… రన్నర్ గా అఖిల్?

Big Boss Non Stop Winner: బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం మరో కొన్ని గంటలలో ముగియనుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమ విన్నర్ బిందుమాధవి అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. మొదట నుంచి టైటిల్ రేసులో బిందు మాధవి, అఖిల్ ఉన్నారు. అప్పటి నుంచి బిందు మాధవి, అఖిల్ మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ఇక ఈ కార్యక్రమంలో బిందు మాధవి టైటిల్ గెలిచినట్టు వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి కూడా బిందుమాధవి ఎంతో చాకచక్యంగా ఆడుతూ మొదటి స్థానంలో ఉంది.

ఈ క్రమంలోనే మరికొన్ని గంటల్లో ఈ కార్యక్రమానికి శుభం కార్డ్ పడనుంది. ఇలా బిందు మాధవి టైటిల్ గెలుచుకోవడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బిగ్ బాస్ తెలుగులో ఇప్పటి వరకు అందరూ కూడా అబ్బాయిలే ట్రోఫీ గెలుపొందారు. ఇలా మొదటసారి అమ్మాయి టైటిల్ గెలుచుకోవడం బిగ్ బాస్ చరిత్రలోనే ఇది మొదట సారి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ జరిగి ఉంటుంది కనుక ఈమె విజేత అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

మొదటినుంచి టైటిల్ కోసం శ్రమించిన అఖిల్ రన్నర్ గా మిగిలిపోయారు. గతంలో కూడా ఇలాగే అమ్మాయిలు టైటిల్ కోసం కోసం ఎంతో శ్రమించారు. గతంలో శ్రీముఖి, సింగర్ గీతా మాధురి కూడా పోటీలో నిలిచి చివరకు రన్నర్ గా నిలిచారు. కానీ బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో ఈసారి ఆడపులిగా దూసుకొచ్చి బిందు మాధవి టైటిల్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచిన వారికి ట్రోఫీతో పాటు 25 లక్షలప్రైజ్ మనీ గెలుపొందనున్నారు.