రానా దగ్గుబాటి ప్రెజెంట్స్, విశ్వదేవ్ రాచకొండ ‘డార్క్ చాక్లెట్’ ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్ విడుదల, 2025లో థియేటర్లలో రిలీజ్

ఇంపాక్ట్ ఫుల్ సినిమాలని అందించే రానా దగ్గుబాటి, మరోసారి వారి మూడో కొలాబరేషన్ కోసం వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో చేతులు కలిపారు. పరేషాన్, 35 చిన్న కథ కాదు చిత్రాల విజయం తర్వాత రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి డార్క్ చాక్లెట్‌ను సగర్వంగా అందిస్తున్నారు.

డార్క్ చాక్లెట్‌లో విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలైంది. ఫస్ట్-లుక్ పోస్టర్‌లో, విశ్వదేవ్ రాచకొండ తన ఫ్యాషన్ ఎటైర్ లో అల్ట్రా-మోడరన్ వైబ్‌ స్టైలిష్ మేకోవర్‌లో ఆకట్టుకున్నారు. రాచకొండ బిందు మాధవి, ఇతర నటీనటులు నిఘా కెమెరాగా కనిపించే వాటిపై కుట్లు వేస్తూ కనిపించడం ఆసక్తికరంగా వుంది. ‘జానర్ ఆడగొడు, మాక్కూడా తెలీదు’ అని పోస్టర్ పై రాయడం మరింత క్యురియాసిటీని పెంచింది

ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం, అజిత్ అబ్రహం జార్జ్ సౌండ్ మిక్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా 2025లో విడుదల కానుంది.

వాల్టెయిర్ ప్రొడక్షన్స్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది, డబుల్ ఇంజిన్‌తో వారి ఇండీ ప్రారంభం, వైరల్ హిట్ పరేషాన్ వరకు అందరూ మెచ్చిన 35 చిన్న కథ కాదు- బాక్సాఫీస్ విజయం అందుకొని అత్యంత ప్రశంసలు పొందిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది- వాల్టెయిర్ ప్రొడక్షన్స్ యూనిక్ సినిమాకు పర్యాయపదంగా ఉంది.

స్పిరిట్ మీడియా, రానా దగ్గుబాటి జాతీయ అవార్డు గెలుచుకున్న బొమ్మలాట (ది బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్) చార్లీ 777, కేర్ ఆఫ్ కంచరపాలెం, గార్గి, కీడ కోలా వంటి మైలురాయి చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కేన్స్-విన్నర్ గోల్డెన్ గ్లోబ్-నామినేట్ అయిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ స్టాండింగ్‌తో వారి వెంచర్‌లు అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందాయి.

డార్క్ చాక్లెట్‌ తో ఈ కొలాబరేషన్ ప్రేక్షకులని అలరించే మరో ప్రత్యేకమైన చిత్రాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తారాగణం: విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి

సాంకేతిక సిబ్బంది:
రచయిత, దర్శకత్వం: శశాంక్ శ్రీవాస్తవయ
సమర్పణ: రానా దగ్గుబాటి
నిర్మాతలు: స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
సౌండ్ మిక్స్: అజిత్ అబ్రహం జార్జ్
పీఆర్వో: వంశీ-శేఖర్