అవకాయ్ బిర్యాని సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ బిందుమాధవి. ఈ బ్యూటీ తరువాత బంపర్ ఆఫర్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయినా కాని తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో తమిళంలోకి అడుగుపెట్టి అక్కడ హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు. వరుస అవకాశాలు అందుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.
మరల తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో నాన్ స్టాప్ విన్నర్ గా నిలిచి బిందుమాధవి తెలుగు ప్రేక్షకులకి మరల చేరువ అయ్యారు. ఇక బిగ్ బాస్ షో ద్వారా ఎక్కువగా ఒటీటీ వెబ్ సిరీస్ లలో ఈ బ్యూటీ అవకాశాలు సొంతం చేసుకుంటుంది. నవదీప్ తో కలిసి ఆమె చేసిన న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ తాజాగా రిలీజ్ అయ్యింది. దీనికి సంబందించిన ప్రమోషన్ ఈవెంట్ లో బిందుమాధవి ఇంటరెస్టింగ్ విషయం రివీల్ చేసింది.
యాంకర్ ఆడియన్స్ తరపున ఒక ప్రశ్న వేసింది. త్రిష మాజీ బాయ్ ఫ్రెండ్ తో మీరు డేట్ లో ఉన్నారని టాక్ ఉంది. ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. దానికి బిందుమాధవి డైరెక్ట్ గా అవును అని సమాధానం ఇవ్వడం విశేషం. త్రిష మాజీ బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉన్నాను. అయితే ఇద్దరం ఒకేసారి లేము. ఆమెతో బ్రేక్ అప్ అయ్యాక తాను డేట్ లో ఉన్నా అంటూ బిందు మాధవి క్లారిటీ ఇచ్చింది.
హీరోయిన్ చాలా మంది ఇంకొకరితో డేట్ లో ఉన్నా కూడా కెరియర్ ని దృష్టిలో పెట్టుకొని రివీల్ చేయడానికి ఇష్టపడరు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. అయితే బిందుమాధవి మాత్రం క్లారిటీ ఇచ్చేయడం విశేషం. తన కెరియర్ గురించి కూడా మాట్లాడిన ఈ బ్యూటీ తెలుగులో అవకాశాలు రాకపోవడం వలనే కోలీవుడ్ కి వెళ్లాలని చెప్పారు.
అలాగే బిగ్ బాస్ తర్వాత సినిమాల కంటే వెబ్ సిరీస్ లలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. సినిమాలలో కూడా ఛాన్స్ లు వస్తాయని వెయిట్ చేస్తున్న. కచ్చితంగా టాలీవుడ్ లో మరిన్ని మంచి సినిమాలలో భాగం కావాలని కోరుకుంటున్నా అని ఈ ప్రెస్ మీట్ లో బిందు మాధవి చెప్పడం విశేషం.