బిగ్‌హస్‌లో నటరాజ్ మాస్టర్ మొదటి నుంచీ డిఫరెంట్ ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు. అప్పుడే అర్జున్ రెడ్డి అయిపోతాడు. అప్పుడే తాను సింహాన్ని, పులినీ అంటాడు. కార్నర్ నుంచి అంతా అబ్జర్వ్ చేస్తున్నా అంటాడు. అందర్నీ అనుమానిస్తాడు. కుండ బద్దలుకొట్టేస్తాడు. సరదాగా కలిసిపోయి మాట్లాడతాడు కాసేపు. అప్పటికప్పుడే ఉగ్రరూపం దాల్చేస్తాడు. గట్టిగా అరుస్తాడు. నటరాజ్ మాస్టర్ అరుపులకీ, కేకలకీ ఒక్కోసారి హౌస్ మేట్స్ కూడా హడలిపోతున్నారు. హౌస్ మేట్స్ అందరినీ జంతువుల పేర్లతో పోల్చి చూస్తున్నాడంటూ, కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు కూడా.
ఆయన ఆటిట్యూడ్ చూస్తుంటే, అది ఓవర్ కాన్ఫిడెన్సా.? లేక, అతి చేస్తున్నాడా.? అసలింతకీ ఆయన స్ర్టేటజీ ఏంటీ.? అనేది అర్ధం కావడం లేదు ఆడియన్స్‌కి. ఇక నామినేషన్స్ విషయంలోనూ ఆయనపై వచ్చే నెగిటివిటీని తీసుకోలేడనే వాదన కూడా ఉంది. తాజాగా కెప్టెన్సీ టాస్క్ పోటీలో లోబోని జంటగా ఎంచుకున్నాడు. లోబో హెల్త్ ఇష్యూస్ కారణంగా టాస్కుల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయలేకపోతున్న సంగతి వీక్షకులకు తెలిసిందే. అయినా, ఓవర్ కాన్ఫిడెన్స్‌తో నువ్వు కూర్చున్నా సరే, నేను గెలిచేస్తాను.. అని ఓవర్ ఆటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఎలాగైనా కెప్టెన్సీ టాస్క్ విన్ అయ్యి, హౌస్ మేట్స్‌కి చుక్కలు చూపించాలనుకుంటున్నాడు కాబోలు నటరాజ్ మాస్టర్. చూడాలి మరి, ఆ ఓవర్ ఆటిట్యూడ్ ఆయన గెలుపుకు దారి తీస్తుందా.? లేక ఓడించేస్తుందా.?