దుబ్బాక ఉప ఎన్నిక: కత్తి కార్తీకకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలిస్తే నోరెళ్లబెడతారు?

bigg boss contestant kathi karthika lost deposit

మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక పోరు ముగిసింది. ఏది ఏమైనా ఈ సారి దుబ్బాక ఎన్నికల ఫలితాలు మాత్రం చాలా టెన్షన్ ను క్రియేట్ చేశాయి. తెలంగాణ ప్రజలంతా ఎవరు గెలుస్తారా? అని టీవీలకే అతుక్కుపోయారు. చివరి నిమిషం వరకు విజయం ఖాయం కాకుండా.. సస్పెన్స్ ను క్రియేట్ చేసింది ఈ ఎన్నిక.

bigg boss contestant kathi karthika lost deposit
bigg boss contestant kathi karthika lost deposit

బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు… 1470 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను ఓడించాడు. మూడో స్థానంలో కాంగ్రెస్ వచ్చింది.

అయితే.. ఈ ఎన్నికల్లో కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేశారు. అందులో ఒకరు కత్తి కార్తీక. ఆమె బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్. వీ6లో యాంకర్ గానూ పనిచేసింది.

అయితే.. ఆమెకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? తెలిస్తే మీరు నోరెళ్లెబెడతారు. ఆమెకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఆమెకు వచ్చిన ఓట్లు 500కు తక్కువేనట. కనీసం 500 ఓట్లు కూడా ఆమెకు పోల్ కాలేదని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

అయితే.. తనను గెలిపించాలంటూ ఆమె దుబ్బాకలో బాగానే ప్రచారం చేసింది. దుబ్బాకలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూడాలంటే తనను గెలిపించాలంటూ ఆమె అందరి ఇళ్లు తిరిగినప్పటికీ.. తనకు కనీసం 500 ఓట్లు కూడా వేయలేదు. తనకు భారీగా షాకిచ్చారు దుబ్బాక ప్రజలు.