Himaja: సంక్రాంతి కానుకగా తల్లికి ఖరీదైన బహుమతి ఇచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజా.. ఫోటోలు వైరల్!

Himaja: బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హిమజ ఇదే పాపులారిటీతో బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లిన ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు కొంత నెగిటివిటీ సంపాదించుకున్న బయటకు వచ్చిన తర్వాత ఈమెకు ఎంతో క్రేజ్ ఏర్పడిందని చెప్పవచ్చు.బిగ్ బాస్ తరువాత ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హిమజ పలు సినిమా అవకాశాలు అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఈమె ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

ఇకపోతే తాజాగా హిమజా సంక్రాంతి పండుగ సందర్భంగా తన తల్లికి అద్భుతమైన బహుమతి ఇచ్చింది.ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా తన తల్లికి ఒక డైమండ్ నెక్లెస్ కొనివ్వాలని హిమజ భావించినట్లు తెలిపారు.నిజానికి తన తల్లికి తెలియకుండా నెక్లెస్ తీసుకెళ్లి తనని సర్ప్రైస్ చేయాలని భావించారు అయితే తనకు నచ్చినది తీసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుందన్న ఉద్దేశంతో తన తల్లిని కూడా వెంట తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. ఈ క్రమంలోనే తన తల్లికి ఎంతగానో నచ్చిన డైమండ్ నెక్లెస్ కొనివ్వడంతో పాటు తను కూడా మరి కొన్ని బంగారు నగలను కొనుగోలు చేసినట్లు ఈ వీడియో ద్వారా తెలియజేశారు.

ఈ క్రమంలోనే హిమజ తన కోసం తన తల్లి కోసం కొన్న నగలను చూపిస్తూ వాటిని వేసుకొని అందంగా ముస్తాబయింది.ఈ నగల షాపింగ్ కి సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అలాగే ఈ డైమండ్ నెక్లెస్ తన బంగారు నదులకు సంబంధించిన ఫోటోలను కూడా హిమజ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.ఇక ఈ ఫోటోలు వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు ఇంత విలువైన వస్తువులను అలా చూపిస్తే దొంగలు పడే అవకాశం ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.