తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బాస్ బ్యూటీ !

బిగ్ బాస్-4 రియాలిటీ షోలో ఫైనల్ వరకు వచ్చిన హైదరాబాద్ అమ్మాయి దేత్తడి హారిక (అలేఖ్య హారిక) తెలంగాణ ప్రభుత్వం నుంచి గౌరవనీయమైన అవకాశం అందుకుంది. హారికను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈమేరకు నియామక పత్రాన్ని హారికకు అందించారు.

Dettadi Harika | Telugu Rajyam

ఇకపై, తెలంగాణ పర్యాటకానికి హారిక అధికారిక ప్రచారకర్తగా వ్యవహరించనుంది. దీనిపై హరిక హర్షం వ్యక్తం చేసింది.హారిక, యూట్యూబ్‌ చానల్ ‘దేత్తడి’ ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్‌తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలో మంచి గుర్తింపు తెచ్చుకంది.

హారిక దీనికంటే ముందు అమెజాన్ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉద్యోగం చేసేది అయితే.. తన టాలెంట్ నిరూపించుకోవడం కోసం ఉద్యోగాన్ని సైతం వదిలేసింది. ప్రస్తుతం హారిక చేసే ‘దేత్తడి’ యూట్యూబ్ చానెల్‌ కు (మిలియన్) 10 లక్షలకు వరకు సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గోన్న హారిక మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం ఓ రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు టాక్.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles