జపాన్ లో “RRR” మాసివ్ రిలీజ్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.!

లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషన్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) గత మార్చ్ లో రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇక థియేటర్స్ లో రన్ అయ్యాక ఓటిటి లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాక అయితే ఈ సినిమా కొత్త పుంతలు తొక్కింది. 

ఇంటర్నేషనల్ వైడ్ హాలీవుడ్ ఆడియెన్స్ లో సాలీడ్ రీచ్ తో దూసుకెళ్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంపై ప్రశంసలు ఆగకుండా వస్తున్న క్రమంలో జపాన్ ఆడియెన్స్ కూడా ఈ సినిమాపై ట్వీట్స్ చేస్తున్నారు. దీనితో పాటుగా జపాన్ లో రిలీజ్ ఎప్పుడు అని అడుగుతుండగా ఈ చిత్ర యూనిట్ అయితే వారికి రిప్లై ఇచ్చారు. 

డెఫినెట్ గా జపాన్ లో RRR సినిమా రిలీజ్ థియేటర్స్ లో ఉంటుంది అది కూడా వెరీ సూన్ అంటూ బిగ్ అప్డేట్ అందించారు. దీనితో ఈ సినిమా మాసివ్ రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జపాన్ లో రాజమౌళి సినిమాలకి గాని ఎన్టీఆర్ కి గాని అలాగే రామ్ చరణ్ సినిమాలకి భారీ క్రేజ్ ఉంది. 

అలాంటిది ఇప్పుడు ఈ అందరి కలయికలో వస్తున్న సినిమా ఇది డెఫినెట్ గా అయితే అక్కడ ఇండియన్ వెర్షన్ లో ఆల్ టైం అధిక వసూళ్లు ఈ చిత్రం అందుకుంటుందేమో చూడాలి.