Radhe Shyam Postponed : టాలీవుడ్ ఆడియెన్స్ సహా పాన్ ఇండియన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ టాలీవుడ్ భారీ సినిమాల్లో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా డస్కీ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా “రాధే శ్యామ్” కూడా ఒకటి. దాదాపు మూడేళ్లు పాటు ఎదురు చూస్తున్న మరో సినిమా ఇది.
ఇక ఈ ఏడాది ఎలాగో జనవరి 14న రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ టైం ఫిక్స్ చేయగా మళ్ళీ కరోనా ప్రభావం ప్రపంచం అంతా పెరుగుతుండడంతో సరికొత్త తలనొప్పి మొదలయ్యింది. దీనితో ఆల్రెడీ ట్రిపుల్ ఆర్(RRR) వాయిదా పడగా రాధే శ్యామ్ కూడా వాయిదా పడుతుంది అని అంతా భావించారు.
మరి ఇప్పుడు అనుకున్నదే అయ్యింది. చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వారు రాధే శ్యామ్ ని వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు దేశంలో కరోనా మరియు ఓమైక్రాన్ తీవ్రత పెరుగుతుంది అని మేము సినిమా తీసుకురావడానికి చాలా ట్రై చేసాం కానీ పరిస్థితులు బాగాలేవు కావున సినిమాని కొన్నాళ్ల పాటు వాయిదా వేస్తున్నామని తెలిపారు.
అలాగే ఓటిటి రిలీజ్ గాసిప్స్ పై కూడా రిప్లై ఇస్తూ ఈ సినిమా బిగ్ స్క్రీన్స్ లో మాత్రమే రిలీజ్ అవుతుందని కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక అలాగే సినిమా కథపై కూడా ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఇచ్చారు. ఈ సినిమా ప్రేమకి, విధికి మధ్యలో ఉంటుంది. అలా మా ప్రేమే ఈ సినిమాని త్వరగా థియేటర్స్ లోకి తీసుకొచ్చేలా చేస్తుంది అని ఈ బిగ్గెస్ట్ అప్డేట్ ని అందించారు.