ఓటీటీ విడుదలకు సిద్ధమైన మాచర్ల నియోజకవర్గం.. ఎప్పుడు.. ఎక్కడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఎప్పుడు ప్రేమ కథ చిత్రాల ద్వారా లవర్ బాయ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే హీరో నితిన్ ఈసారి మాత్రం దుర్మార్గులైన రాజకీయ నాయకుల భరతం పట్టే కలెక్టర్ పాత్రలో నటించి సందడి చేశారు. ఇక ఈ సినిమా ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇలా ఆగస్టు 12వ తేదీ ఎన్నో అంచనాల నడుమ విడుదలైనటువంటి ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది.ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్స్ మంచి అంచనాలు పెంచినప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేదు. ఇలా మిక్స్డ్ టాక్ తో థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది.

ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానుంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ మేకర్స్ నుంచి ఏ విధమైనటువంటి క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే ఈ సినిమాని డిసెంబర్ 9వ తేదీ నుంచి జీ 5 లో ప్రసారం చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దీంతో తొమ్మిదవ తేదీ నుంచి ఈ సినిమా డిజిటల్ మీడియాలో కూడా ప్రేక్షకులను సందడి చేయనుంది. థియేటర్లో పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది.