Jagan Convoy Death: వైయస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో పెద్ద ఎత్తున అపశృతి చోటుచేసుకుంది. జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్ కింద సింగయ్య అనే కార్యకర్త పడినప్పటికీ కూడా గమనించని డ్రైవర్ తనపై కారు పోనివ్వడంతో సింగయ్య మరణించారు అంటూ జగన్మోహన్ రెడ్డి పై, అదేవిధంగా అతని డ్రైవర్ పై కూడా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును కూడా సీజ్ చేశారు. ఇక ఈ ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక కూడా వెళ్లడైంది. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడే సింగయ్య మరణించారని ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కూడా వెళ్లడయ్యాయి.
ఇక ఈ విషయంపై తాజాగా సింగయ్య భార్య చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మృతుడు సింగయ్య భార్య లూర్దు మేరీ, ఆమె కుమారులు, కుటుంబసభ్యులు వచ్చారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి వీరిని కలిసి అనంతరం కాసేపు వీరితో మాట్లాడి కుటుంబ క్షేమం గురించి తెలుసుకున్నారు అదేవిధంగా కొంతమేర ఆర్థిక సహాయం కూడా అందజేశారు. తన కుటుంబానికి భరోసా కల్పించారు. ఇలా జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం లూర్డు మేరీ మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రమాదంలో నా భర్త సింగయ్యకు తగిలిన దెబ్బలు చిన్నవే. అంత బాగా ఉన్న ఆయన ఎలా చనిపోయారు? అంబులెన్స్‌లో కచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది’ అని అనుమానం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తమకెంతో భరోసా ఇచ్చారని తెలిపారు. ఇక మా ఆయన చనిపోయిన తర్వాత కొంతమంది మా ఇంటికి వచ్చారని ఈమె వెల్లడించారు.దాదాపు 50 మంది టీడీపీ మనుషులు కూడా మా ఇంటికి వచ్చి.. లోకేశ్ పంపారు, మేం కూడా మీ కులస్తులం, ఎస్సీలమే అని చెప్పారు. ఇంకా ఏవేవో మాట్లాడి ప్రలోభపెట్టాలని చూశారు’ అని సింగయ్య భార్య లూర్దు మేరి సంచలన ఆరోపణలు చేశారు. ‘అందుకే మా ఆయన మరణంపై మాకు అనుమానాలు వస్తున్నాయి’ అని ఆరోపించారు. ఇలా ఈమె వ్యాకలతో ఒక్కసారిగా ఈయన మరణం పై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.