RRR : పాన్ ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ అయినటువంటి ట్రిపుల్ ఆర్(RRR) సినిమా ఈ కొత్త సంవత్సరం స్టార్టింగ్ తోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీనితో ప్రతి ఒక్కరికీ షాక్ తగిలింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ భారీ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి బుకింగ్స్ ఓపెన్ చెయ్యకుండానే ఆగిపోయింది.
దీనితో మన దగ్గర నష్టాలు లేవు కానీ ఓవర్సీస్ మార్కెట్ లో ఈ చిత్రం ఆగిపోవడం బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడే ఈ సినిమా ఆడియెన్స్ కి నష్టాలు మిగిల్చిందట. అక్కడ మొత్తం 70 వేలకు పైగా టికెట్స్ అమ్ముడు పోగా ప్రీ సేల్స్ లో భారీ మొత్తాన్నే ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ అందుకున్నారు. కానీ అనుకోని వాయిదాతో టికెట్లు బుక్ చేసుకున్న వారికి మళ్ళీ డబ్బు వెనక్కి పంపే ప్రయత్నం స్టార్ట్ చేశారు.
కానీ ఈ ప్రయత్నంలోనే ఏకంగా 1 కోటి నష్టం వచ్చిందట. సినిమా టికెట్ బుక్ చేసుకున్న వారికి కన్వినెన్స్ ఫీజ్ గా కట్ చేసిన డబ్బు వెనక్కి రాలేదట. దీనితో మొత్తంగా ఓవర్సీస్ ఆడియెన్స్ భారీ లాస్ ని చూసారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మన దగ్గర కూడా బుకింగ్స్ ఓపెన్ చేసి ఉంటే ఈ నష్టం ఇంకా ఎక్కువే ఉండేది అని చెప్పాలి.