టాలీవుడ్ ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ పరంగా ఉన్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఇలా చాలా కుటుంబాల హీరోలు ఇప్పుడు తెలుగు సినిమా దగ్గర చలామణి అవుతున్నారు.
మరి ఓ రకంగా వాస్తవం మాట్లాడుకుంటే మెగా మరియు నందమూరి కుటుంబం మధ్య బాక్సాఫీస్ యుద్ధం గట్టిగా ఉంటుంది. పైగా పలు సందర్భాల్లో అయితే ఇరు ఫ్యామిలి నటులకి మాటల యుద్ధాలు కూడా జరిగాయి. అయితే మెగాస్టార్ మాత్రం ఎప్పుడు ఏమన్నా అన్నట్టుగా దాఖలాలు లేవు.
మరి ఇప్పుడు ఈ ఇరు కుటుంబాల నుంచి మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి బాలయ్య కలిసి ఓకే స్టేజి పై కనిపించనున్నట్టుగా టాక్ వైరల్ గా మారింది. బాలయ్య వ్యాఖ్యాతగా ఆహా యాప్ లో ఓ ఓటిటి షో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
మరి ఈ షో ఇప్పుడు రెండో సీజన్ కి సిద్ధం అవుతుండగా ఈ సీజన్లో ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా చిరంజీవి హాజరు అవుతారని తెలుస్తుంది. అంటే ఇక గెస్ట్ గా వచ్చే చిరుకి బాలయ్య నుంచి పలు సూటి ప్రశ్నలు తప్పవని చెప్పాల్సిందే.
ప్రస్తుతం అయితే ఈ బిగ్ గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో అత్యంత ఆసక్తిగా మారిపోయింది. అలాగే ఇందులో ఎంత నిజముందో అని ఇరు హీరోల అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.