Radhe Shyam in Ott : “రాధే శ్యామ్” ఇన్ ఓటిటి..ఈ దిగ్గజ సంస్థలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా.!

Radhe Shyam in Ott : ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర అసలు ఆట మొదలు పెట్టనున్న మొదటి సౌత్ ఇండియన్ సినిమా “రాధే శ్యామ్”. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ సిద్ధం చేస్తుండగా ఈ మధ్యలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ని కూడా సిద్ధం చేస్తున్నారు.
ఆల్రెడీ పలు భాషల్లో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి హక్కులు మరియు స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరు అనే దానిపై కీలక టాక్ అలా సస్పెన్స్ గానే ఉంది. అయితే మొదట్లో జీ సంస్థ వారు భారీ ఆఫర్ ని ఈ సినిమాకి ఇచ్చినా మేకర్స్ వద్దని  చెప్పేసారు.
కానీ ఇప్పుడు ఫైనల్ గా రాధే శ్యామ్ స్ట్రీమింగ్ పార్ట్నర్ పై ఒక క్లారిటీ వినిపిస్తుంది. దీని బట్టి అయితే ఈ సినిమా తాలుకా ఓటిటి హక్కులని ప్రపంచ దిగ్గజ స్ట్రీమింగ్ యాప్స్ లో ఒకటైన అమేజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు కొనుగులు చేశారట. అయితే వీరు కేవలం సౌత్ భాషల్లో కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
అలాగే ఇంకోపక్క ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కి వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన నాలుగు నుంచి ఆరు వారాలు దాటిన తర్వాత కానీ ఓటిటి వెర్షన్ లో అందుబాటులోకి రాదనీ ఓటిటి వర్గాలు నుంచి సమాచారం. ఫైనల్ గా రాధే శ్యామ్ ఓటిటి పై అయితే ఇదే సిసలైన క్లారిటీ.