ఓటిటిలో ఒకేరోజు “RRR”, “ఆచార్య”..డేట్ ఇదేనట!

Acharya And RRR Movies

Acharya And RRR Movies : ఈ ఏడాదికి తెలుగు సినిమా దగ్గర ఎలాగైతే కొన్ని భారీ సూపర్ డూపర్ హిట్ లు ఉన్నాయో అదే విధంగా ఆ స్థాయిలోనే డిజాస్టర్ గా నిలిచినా సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని రీజనల్ తో పాటుగా పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటిలో ఒక భారీ హిట్ అలాగే..

ఇంకొకటి భారీ డిజాస్టర్ సినిమాలు రెండు కూడా ఒకే రోజు ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి రాబోతున్నట్టుగా సినీ వర్గాల్లో ఇప్పుడు బిగ్ బజ్ వినిపిస్తుంది. మరి ఆ సినిమాలే ఒకటి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు నటించిన బిగ్గెస్ట్ ఇండియన్ గ్రాసర్ ట్రిపుల్ ఆర్(RRR) కాగా మరొకటి అదే రామ్ చరణ్ మరియు మెగాస్టార్ చిరంజీవి లు నటించిన చిత్రం ఆచార్య.

అయితే ఆచార్య సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే చాలా త్వరగా ఓటిటి లో వచ్చేసే అవకాశం ఉందని టాక్ మొదలైంది. ఇప్పుడు అది నిజం అయ్యేలాగే మరిన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పైగా ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు స్ట్రీమింగ్ కి రావచ్చని ఒక టాక్.

మరి దీని ప్రకారం అయితే ఈ రెండు సినిమాలు ఈ మే 20 నుంచి జీ 5 మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులో రానున్నాయట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఆల్రెడీ ఆచార్య కోసం అయితే ప్రైమ్ వీడియో వాళ్ళు అదనంగా 18 కోట్లు చెల్లించారని ఒక టాక్ ఉంది.