బిగ్ బ్రేకింగ్: క‌రోనాతో ఎమ్మెల్యే మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి దేశంలో విల‌య‌తాండ‌వం చేస్తోంది. లాక్ డౌన్ స‌డ‌లింపుల నేప‌థ్యంలో క‌రోనా కోర‌లు చాచి విరుచుకుప డుతోంది. అన్ని రాష్ర్టాల్లో కేసులు ఒక్క‌సారిగా పెరిగిపోతున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య అధికంగానే ఉంది. ఇప్పుడు కొవిడ్ -19 వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌ర్నీ చుట్టేస్తోంది. ఇప్ప‌టికే ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో కొంత మంది రాజ‌కీయ నాయ‌కులకు క‌రోనా అంటుకుంది. సెల‌బ్రిటీల్లోనూ క‌ల్లోలం సృష్టించింది. ఏపీలో విజ‌య‌న‌గ‌రం జిల్లాకి చెందిన ఓ ఎమ్మెల్యే క‌రోనా భారిన ప‌డ్డ‌ట్లు మంగ‌ళవార‌మే నిర్ధార‌ణ అయింది. అయితే తాజాగా క‌రోనా సోకి తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌, ఎమ్మెల్యే త‌మోనాష్ ఘోష్ కన్నుమూశారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఈ విషయాన్ని స్వ‌యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్ల‌డించారు.

ఇది చాలా దురదృష్టకరం. 1998 నుంచి పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న తమోనాష్ ఘోష్ మనల్ని వీడి వెళ్లిపోయారని ట్వీట్ చేశారు. త‌మోనాష్ ఘోష్ గ‌త నెల‌లో క‌రోనా భారిన ప‌డ్డారు . అప్ప‌టి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కావ‌డంతో ఆయ‌న‌కు ప్ర‌త్యేకమైన డాక్ట‌ర్ల బృందం వైద్యం అందిస్తోంది. అయితే వ‌య‌సు మీద ప‌డ‌టంతో, కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టం ఆయ‌న‌కు ప్రాణంత‌కంగా మారిన‌ట్లు తెలుస్తోంది. పాత జ‌బ్బులు తిర‌గ‌బెట్టడం, క‌రోనా సోక‌డంతో ఆరోగ్యం విష‌మించి క‌న్నుమూసిన‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు. త‌మోనాష్ మృతితో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీలో విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి.

తమోనాష్ 35 సంవత్సరాలుగా త‌మ‌తో కలిసి పనిచేశారని, పార్టీ కోసం, ప్రజల కోసం ఆయన ఎంతో శ్రమించారని, ఎన్నో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని మమతా బెనర్జీ కొనియాడారు. ఆయన మృతి పార్టీకి తీర‌ని లోటు తీవ్ర దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేసారు. ఆయన భార్య ఝార్నా, బంధుమిత్రులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మ‌మ‌త ప్రార్ధించారు. ఇంకా ఆయ‌న మృతిప‌ట్ల ప‌ల‌వురు రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఇటీవల కరోనాతో తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే జె.అన్బళగన్ కూడా మరణించిన సంగతి తెలిసిందే.