బిగ్ బ్రేకింగ్ : అమరావతి రైతుల కష్టాలు తీరబోతున్నాయి ? జగన్ రంగంలోకి దిగాడు ! 

 

ఏపీలో వైఏస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత ప్రారంభం అయినా అతి పెద్ద వివాదం అమరావతి రాజధాని విషయం.. ఈ రాజధాని అమరావతి వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ అటు ప్రజలకు, రైతులకు, ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.. ఇకపోతే రాజధాని అమరావతి విషయంలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీ ఒక లెక్క చెప్తుంటే, వైసీపీ ఇంకో లెక్క చెప్తుంది.. దీనివల్ల ఈ సమస్య ఇంతవరకు ఒక కొలిక్కి రాలేకపోయింది..

ఈ నేపధ్యంలో ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్ణయానికి కట్టుబడి రాజధానుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.. ఈ విషయంలో ప్రతిపక్షాలతో పాటుగా అక్కడి రైతులు కూడా అధికార పార్టీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ఉన్న సాగు భూముల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చామని, కానీ ప్రభుత్వం తమను మోసం చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.. ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేసి పరిపాలనా రాజధానిగా వైజాగ్ ను నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వం పై ఎన్ని విమర్శలు వస్తున్న, ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్న అమరావతి రైతుల విషయంలో వైసీపీ సర్కార్ మొదటి నుంచి ఒక పధకం ప్రకారం ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో అమరావతి నిమిత్తం జరిపిన భూసేకరణలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, భూ దందాలు చేసి అక్కడ ఇన్సైడెర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారని కూడా వైసీపీ సర్కార్ ఆరోపిస్తుంది.. అంతే కాకుండా ఈ విషయం మీద సిట్, ఏసీబీ విచారణకు కూడా ప్రభుత్వం రెడీ అయిన సంగతి విధితమే. ఈ పరిణామాల నేపధ్యంలో వైఎస్ జగన్, అమరావతిని మూడు ముక్కలుగా చేసి అధికార వికేంద్రీకరణ చేపట్టాలని నిర్ణయించి చట్టాన్ని కూడా చేశారు.. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది.. మరో వైపు విపక్షాలు కూడా రైతులకు మద్దతుగా ఉంటూ ప్రభుత్వానికి రైతులకు మధ్యన అతి పెద్ద అగాధాన్ని అనుమానాన్ని పెంచాయనే ఆరోపణలు వస్తుండగా వీటన్నీంటికి సమాధానంగా, తాజాగా జగన్ సర్కార్ అమరావతి రైతుల సమస్యలు ఏంటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారట..

 

ఈ ఆలోచనలో భాగంగా అమరావతి రైతులతో డైరెక్ట్ గా మాట్లాడాలని సీయం జగన్ డిసైడ్ అయినట్లుగా కొందరు పార్టీ నాయకులు అనుకుంటున్నారట. అమరావతి రైతుల సమస్యలు ఏంటో తెలుసుకోవడం, వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూడడం జగన్ అజెండాగా ఉంటుందని అంటున్నారు. అదే నిజం అయితే మాత్రం అమరావతి రైతుల సమస్యలు నూరు శాతం పరిష్కారం అయి వారి కష్టాలు తీరినట్లే అనే ఆశ అక్కడి రైతుల్లో చిగురిస్తుందట.. మరి జగన్ రంగంలోకి దిగి రైతులకు ఎంత వరకు న్యాయం చేస్తారో చూడాలి..