Jogi Ramesh: వైసీపీలో కీలక నేతగా మాజీ మంత్రిగా కొనసాగిన జోగి రమేష్ ఇటీవల మీడియా సమావేశంలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. జోగి రమేష్ గతంలో తెలుగుదేశం పార్టీ మంత్రితో కలిసి కనిపించడంతో ఈయన తెలుగుదేశం పార్టీలోకి వస్తారని అందరూ భావించారు కానీ తాను జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి రానని క్లారిటీ ఇచ్చారు అయితే ఉన్నఫలంగా మరోసారి జోగి రమేష్ యు టర్న్ తీసుకున్నారని తెలుస్తోంది. వైసిపి పై ప్రజలలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తొలగించడం కోసం ఈయన సానుభూతి మాటలు మాట్లాడటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఓడిపోవడానికి గల కారణాల గురించి ఈయన మాట్లాడుతూ పలు విషయాలు బయటపెట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడం వైసిపి పార్టీ ఓటమికి ప్రధాన కారణమని తెలిపారు. ఇకపై జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయినప్పటికీ మూడు రాజధానుల అంశం తీసుకురారని అమరావతిలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారని జోగి రమేష్ తెలిపారు.
ఇకపోతే అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురించి తప్పుగా మాట్లాడటం కూడా వైసిపి ఓటమికి కారణమని ఈయన వెల్లడించారు. ఇలా భువనేశ్వరి గారి గురించి అసెంబ్లీలో మాట్లాడిన సమయంలో ఇంట్లో నా భార్య కూడా నన్ను తిట్టిందని తెలిపారు. మీరు అసెంబ్లీకి వెళ్ళేది ప్రజా సమస్యలను చర్చించడానికి లేకపోతే ఇలా ఆడవారి గురించి తప్పుగా మాట్లాడడానికా అంటూ ఆమె కూడా నన్ను తిట్టిందని మేము అలా చేసి ఉండకూడదు అంటూ జోగి రమేష్ తెలిపారు. దీంతో ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. చాలా లేటుగా జోగి రమేష్ రియలైజ్ అయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే.. మాజీ మంత్రి జోగి రమేష్.. వైసీపీ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను.. సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.