Big Boss Siri: సిరి పెళ్లి ఫిక్స్.. వెంటనే హనీమూన్.. బిగ్ బాస్ జ్యోతిష్యురాలు చెప్పిన షాకింగ్ నిజాలు ఇవే!

Big Boss Siri: బుల్లితెర ప్రసారమౌతున్న బిగ్ బాస్ కార్యక్రమం నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ ల మధ్య ఎంతో టెన్షన్ గా ఉన్నది చెప్పవచ్చు. మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ ట్రోఫీ ఎవరు అందుకుంటారు అనే విషయం పై తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం అందరికన్న టాప్ వన్ లో సన్నీ ఉన్నారని ఇప్పటికే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల కోసం జ్యోతిష్యరాలు శాంతిని లోపలికి పంపించారు. ఈ సందర్భంగా ఆమె హౌస్ లో ఉన్నటువంటి ఐదు మంది కంటెస్టెంట్ జాతకం చెబుతూ వారి భవిష్యత్తు గురించి వెల్లడించారు.

ఈ క్రమంలోనే సిరి గురించి జ్యోతిష్యరాలు శాంతి మాట్లాడుతూ తన బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళగానే తనకు పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలిపారు. పెళ్లి తర్వాత వెంటనే విదేశాలకు హనీమూన్ వెళ్తారని జ్యోతిష్యరాలు శాంతి సిరి జాతకాన్ని చెప్పారు. ఇక పోతే తనలో చిన్న చిన్న భయాలు ఉన్నాయని అవి కాస్త తొలగిపోతే తప్పకుండా విజయాలను అందుకుంటుందని ఈమె వెల్లడించారు.

ఈ విధంగా జ్యోతిష్యరాలు శాంతి సిరి పెళ్లి గురించి వెల్లడించారు. అయితే సిరి హౌస్ లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ నుంచి లెటర్ రాగా అందులో శ్రీహన్ కూడా సిరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లగానే పెళ్లి చేసుకుందామని ఇకపై ఒకరిని విడిచి ఒకరు ఉండకూడదని భావించారని లెటర్లో రాసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సిరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లగానే పెళ్లి పీటలు ఎక్కబోతోందని తెలుస్తుంది.