Big Boss 5 Telugu: పింకీకి ఖరీదైన బహుమతి ఇచ్చిన ప్రియా ఆంటీ.. కారణం ఏంటంటే?

Big Boss 5 Telugu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ప్రియా ప్రియాంక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఆర్టిస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన ప్రియా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.అలాగే ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ బిగ్ బాస్ హౌస్ లో ఏకంగా 13 వారాల పాటు కొనసాగుతూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.

ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు వీరు హౌస్ సభ్యులతో ఎంతో మంచిగా ఉంటూ ఏ కంటెస్టెంట్ కి ఏం జరిగినా వారిని ఓదారుస్తూ అందరికి ఎంతో ప్రేమానురాగాలను పంచారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ కంటెస్టెంట్ ల మధ్య మంచి బంధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నటి ప్రియా తన భర్త దుబాయ్ నుంచి తన కోసం ఒక డైమండ్ రింగ్ తీసుకు వస్తే ఆ డైమండ్ రింగ్ ను ఎంతో ప్రేమగా ప్రియాంక సింగ్ కి బహుకరించింది.

ఇలా ప్రియా పంపించిన బహుమతి చూసి ఒక్కసారిగా ఎంతో ఆశ్చర్యపోయిన పింకీ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి గిఫ్ట్ నేను ఊహించలేదని ఇంత ఖరీదైన బహుమతి పంపించినందుకు థాంక్యూ సోమచ్ ఐలవ్యూ అక్క అంటూ సోషల్ మీడియా ద్వారా డైమండ్ రింగ్ ఉన్నటువంటి ఫోటోను పోస్ట్ చేశారు. ఇక ఈ సందర్భంగా ప్రియాంక సింగ్ మాట్లాడుతూ తనను ఒక అమ్మగా భావించానని తన మనస్సు ఎంతో మంచిదని, తనకు ఈ డైమండ్ రింగ్ కన్నా ప్రియా అక్కే ఒక పెద్ద డైమండ్ అంటూ తన గురించి వెల్లడించారు.