డైరెక్టర్ లింగుస్వామికు క్షమాపణలు చెప్పిన రామ్.. ఎందుకంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన రామ్ ది వారియర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉండగా.. తాజాగా ఈ సినిమాలో మరో పాటను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో.. రామ్ మాట్లాడుతూ ఆ సాంగ్ తనకు నచ్చిందని.ఇక మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ కు, సింగర్స్ కు, నిర్మాతలకు, చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపాడు.

కానీ ఈ సినిమా డైరెక్టర్ లింగుస్వామి గురించి చెప్పడం మర్చిపోగా.. ఆ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ సినిమా తెరకెక్కడంలో ముఖ్య పాత్రను పోషించిన వ్యక్తి గురించి చెప్పడం మర్చిపోయాను అంటూ.. తన వారియర్, డైరెక్టర్ లింగుస్వామి అని.. ఈ సినిమాకు సంబంధించిన ప్రతిదీ భుజాలపై ఎత్తుకున్నారని.. తను పనిచేసిన ఉత్తమమైన దర్శకులలో అతడు ఒకరిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని.. సారీ అండ్ లవ్ యూ అని అనడంతో.. లింగు స్వామి కూడా స్వీట్ గా స్పందించాడు.