భీమవరం పర్యటనకు హాజరు కాకపోవడానికి కారణం తెలిపిన ఎంపీ రఘురామకృష్ణరాజు..

ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హాజరు కావడం లేదని తెలిసింది. హైదరాబాదులోని లింగంపల్లి నుండి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరి ఆదివారం రాత్రి బేగంపేట్ రైల్వే స్టేషన్ లో దిగి మళ్లీ వెనుతిరిగారు. అలా తిరగటానికి కారణం ఏంటో ఒక వీడియో ద్వారా పంచుకున్నారు.

భీమవరంలో తన అనుచరులు కొందరిపై ఇప్పటికే పలు కేసులు ఉండటంతో 55 మందిని పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెడుతున్నారని తెలిసిందంటూ.. తను వెళ్తే వారిని ఇంకా బాధ పెడతామని చెబుతున్నారు అంటూ.. దాంతో తాను భీమవరం వెళ్లకపోతే వాళ్ళని వదిలేస్తామని పోలీసులు చెప్పారు అని అన్నారు. ఇక తన శ్రేయోభిలాషుల శ్రేయస్సు కోరి తన ఒక అడుగు వెనక్కి వేయాలనుకున్నాను అని.. తనకోసం ఎవరు భీమవరం రావద్దని తెలిపారు.