Big Boss 5 Priyanka: అమ్మో…బిగ్ బాస్ షో ద్వారా పింకీ అంత సంపాదించిందా!

Big Boss 5 Priyanka: బిగ్ బాస్ చరిత్రలోనే ఒక ట్రాన్స్జెండర్ ఇన్ని వారాలపాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన దాఖలాలు లేవు అని చెప్పవచ్చు. తెలుగు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ 13 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచింది. ఇక 13వ వారం ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఈమె ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందని చెప్పవచ్చు.

ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈమె హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. బిగ్ బాస్ ట్రోఫీ తప్పకుండా మానస్ గెలుస్తాడని భావించింది.మానస్, సన్నీ వీరిద్దరిలో ట్రోఫీ తప్పకుండా ఒకరికి వస్తుందని మానస్ కి వస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని తెలిపింది. ఇకపోతే 13 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన ప్రియాంక సింగ్ కు 13 వారాలకి బిగ్ బాస్ ఎంత మొత్తంలో రెమ్యునరేషన్ చెల్లించారు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.

ముందుగా కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రియాంక సింగ్ ఒక వారం పాటు హౌస్ లో ఉంటే తనకు 1.75 లక్షల నుంచి రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ చెల్లించాలని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 13 వారాలపాటు పింకీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అందుకుగాను ఈమెకు సుమారు పాతిక లక్షల వరకు సంపాదించుకున్నట్లు సమాచారం. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈమె ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన విషయాలను దృష్టిలో ఉంచుకొని నిర్వాహకులు మరింత ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.