అనసూయ పై స్కిట్ చేసిన దొరబాబు.. ఆపకపోతే వైలెంట్ చూస్తారంటూ అనసూయ!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అనసూయ చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ప్రతి వారం అనసూయ అద్భుతమైన లుక్ తో ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తుంటారు.ఇకపోతే తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా అనసూయ గేటప్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా దొరబాబు పరదేశి స్కిట్ సైతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెప్పాలి.

దొరబాబు పరదేశి స్కిట్ చేస్తూ అనసూయ హోమ్ టూర్ చేశారు. ఈ క్రమంలోనే అనసూయ పై భారీగా సెటైర్లు పేల్చారని చెప్పాలి.అనసూయ తన గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేసిన ఎలా రియాక్ట్ అవుతుందో మనందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే తన రియాక్షన్ గురించి కూడా పరదేశి ఈ స్కిట్ ద్వారా చూపించారు. ఇక పరదేశి వెళ్తూ అనసూయ ఇంటి కాలింగ్ బెల్ కొట్టగానే నైటీ వేసుకొని రైజింగ్ రాజు అనసూయ పాత్రలో బయటికి వచ్చారు.అలా రైజింగ్ రాజు తన పాత్రలో నటించడం చూసి అనసూయ గుండె ముక్కలైందని చెప్పాలి.

అనసూయ హోమ్ టూర్ చేయడానికి వచ్చానని పరదేశీ చెప్పగా అనసూయ గెటౌట్ ఫ్రమ్ మై హోమ్ అంటూ వారిపై అరుస్తుంది. దీంతో పరదేశి ఇది ఫేస్ బుక్ కాదు యూట్యూబ్ అంటూ తన పరువు తీస్తాడు. అదే విధంగా మీ భర్తను పిలవండి అంటూ చెప్పగా వెంటనే దొరబాబు చేయి ఊపుతూ వస్తాడు. దొరబాబు అనసూయ భర్త పాత్రలో నటించగా అనసూయ మాట్లాడుతూ రాముడు లాంటి నా భర్తను దొరబాబు చేశారు. ఈ స్కిట్ ఇంతటితో ఆగకపోతే వైలెంట్ అంటే ఏంటో చూస్తారు అంటూ సరదాగా దొరబాబు పరదేశి లకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది.