Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. బ్లడ్ క్యాన్సర్ కు దారితీసే ప్రమాదం ఎక్కువ..!

Health Tips: ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం మందిని ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ సమస్య చాలా ప్రమాదకరమైనదిగా పరిగణించవచ్చు. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ సమస్య తీవ్రత ఎక్కువయింది. అనేక రకాల క్యాన్సర్ల బారిన పడి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లలో బ్లడ్ క్యాన్సర్ కూడా ఒకటి. దీనినే లుకేమియా అని కూడా అంటారు. శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినప్పుడు ఈ క్యాన్సర్ మొదలవుతుంది. అయితే మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి బ్లడ్ క్యాన్సర్ ను ముందే గుర్తించడం వచ్చునని నిపుణులు వెల్లడించారు.

సాధారణంగా శరీరంలోని ఎముకల మజ్జలో తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అవుతాయి. ఎముకల మజ్జలో తెల్లరక్తకణాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు రక్త నాళాల ద్వారా శరీరం అంతటా వ్యాపిస్తాయి. వేరే ఇతర క్యాన్సర్ల లాగా ఈ క్యాన్సర్కు కణతులు ఏర్పడవు. ఎక్స్ రే పరీక్ష ద్వారా మాత్రమే దీనిని గుర్తించవచ్చు. బ్లడ్ క్యాన్సర్ లో కూడా అనేక రకాలు ఉంటాయి.కొన్ని రకాల క్యాన్సర్ల చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తే మరికొన్ని మాత్రం పెద్ద వారిలో ఎక్కువగా వస్తాయి.

బ్లడ్ క్యాన్సర్ సోకినప్పుడు లక్షణాలను గుర్తించి వెంటనే డాక్టర్ని సంప్రదించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చు.బ్లడ్ క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు కనిపించే కొన్ని లక్షణాలు గురించి తెలుసుకుందాం.

• బ్లడ్ క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు ఎల్లప్పుడూ అలసట, నీరసంగా ఉంటుంది.
• ఏదైనా గాయమైనప్పుడు అధిక మొత్తంలో రక్తస్రావం జరుగుతుంది.
• ఎముకలు, కీళ్ల నొప్పులు విపరీతంగా ఉంటాయి.
• చలి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. రాత్రి వేళల్లో ఎక్కువగా చెమటలు పడతాయి.
• అతి తక్కువ కాలంలోనే అధికమొత్తంలో శరీర బరువు తగ్గిపోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి కూడా బ్లడ్ క్యాన్సర్ సోకినప్పుడు కనిపించే లక్షణాలు.