ఇదేం ఖర్మ.? ‘కోవిడ్ లాక్ డౌన్’ మీద బెట్టింగులట.!

Bettings On Lockdown, Silly But Dangerous

Bettings On Lockdown, Silly But Dangerous

పిచ్చి మరీ ఇంత తారాస్థాయికి ముదిరిపోతుందని బహుశా ఎవరూ ఊహించి వుండరేమో. దేశంలో ఇంకోసారి లాక్ డౌన్ అనేది వుండబోదని కేంద్రం చెబుతున్నప్పటికీ, పాక్షిక లాక్ డౌన్ అయితే తప్పేలా లేదు. లాక్ డౌన్ వల్ల వచ్చే నష్టాన్ని ఇప్పటికే భరించేశాం. మళ్ళీ ఇంకోసారి భరించే శక్తి దేశానికీ, దేశ ప్రజలకీ లేదు. అదే ఉద్దేశ్యంతో వుంది కేంద్ర ప్రభుత్వం కూడా. కానీ, కొందరు లాక్ డౌన్ మీద కూడా బెట్టింగులు కాసేస్తున్నారు. మే నెల 2వ తేదీ నుంచి దేశంలో మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ వుంటుందన్నది బెట్టింగుల నిర్వాహకులు చెబుతున్నమాట.

ఈ మేరకు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ప్రచారం జరుగుతోంది. అయితే, అవన్నీ పుకార్లేనని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. నిజానికి, ఇప్పుడున్న పరిస్థితుత్లో సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ ప్రచారాల్ని అదుపు చేయడం చాలా అవసరం. సోషల్ మీడియా ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సమాచారం ఎలాగైతే దొరుకుతోందే, అదే క్రమంలో అత్యంత నిర్లక్ష్యపూరితమైన పరిస్థితుల్లో ఫేక్ ప్రచారం కూడా లభ్యమవుతోంది. పది మంది చనిపోయారనే వార్తని, వంద మంది చనిపోయారన్నట్లుగా మార్ఫింగ్ చేయడం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆఖరికి కరోనా లాక్ డౌన్ మీద కుడా బెట్టింగులు కాసే స్థాయికి దిగజారిపోయారంటే, అలాంటోళ్ళని మనుషులుగా చూడలేం. ముందుగా అలాంటి వ్యక్తులకు కరోనా సోకి.. వాళ్ళంతా ఇప్పటికిప్పుడు చచ్చిపోతే బావుణ్ణని సామాన్యులు కోరుకుంటున్నారు.

న్యూస్ ఛానళ్ళు చూస్తే కరోనా, పత్రికలు తిరగేస్తే కరోనా.. ఏ చిన్న వార్త చూసినా ప్రజలు భయాందోళనలకు గురవుతున్న దరిమిలా, లాక్ డౌన్ మీద ఫేక్ ప్రచారం అనేది.. చాలామంది ప్రాణాల మీదకు తెస్తోంది.