గత కొన్ని రోజుల నుండి మహమ్మద్ ప్రవక్త మీద వస్తున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. దీంతో హౌరా జిల్లాలో కొందరు కార్లు రోడ్లపైకి వచ్చి పెద్ద వివాదం సృష్టించారు. ఇక పోలీసులు గొడవలను సద్దుమణిగి చేయటానికి ప్రయత్నించగా అక్కడ మరింత ఘర్షణ ఏర్పడింది.
అక్కడున్న నిరసనకారులు పోలీసులపైకి రాళ్ల దాడి చేశారు. ఇక ఈ విద్వేషానికి ప్రజలంతా ఒకటి కావాలి అని పోలీసులు పిలుపు ఇచ్చారు. ఇటువంటి అల్లరిలో భాగం కావద్దు అని.. రెచ్చగొట్టే మాటలలో తలదూర్చవద్దు అని సలహాలు ఇచ్చారు. ఒకవేళ ఏదైనా అల్లర్లు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా ఫేక్ న్యూస్ లాంటివి ప్రచారం చేయవద్దని.. చేస్తే కఠినమై చర్యలు ఉంటాయని అన్నారు.