Devotional Tips: సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్లినప్పుడు లేదా ఇంట్లో పూజ చేసే సమయంలో తమలపాకుపై దీపం వెలిగించడం చేస్తుంటాము.ఈ విధంగా తమలపాకుపై దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం చాలా మందికి తెలియక పోయినప్పటికీ ఇతరులు చేస్తున్నారు కనుక మనం కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ ఉంటాము. అయితే తమలపాకుపై దీపం ఎందుకు వెలిగించాలి..ఇలా దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
హిందూ సంప్రదాయాల ప్రకారం తమలపాకుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తమలపాకు కాడలో పార్వతి దేవి, మధ్యలో సరస్వతి, చివరన లక్ష్మీదేవి కొలువై ఉంటారని భావిస్తారు. అందుకే తమలపాకుపై దీపం వెలిగించడం వల్ల ఈ ముగ్గురి అమ్మ వారి ఆశీస్సులు మనపై ఉంటాయని అర్థం. అందుకే తాజాగా ఉన్న తమలపాకుల పై దీపం వెలిగించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
అయితే తమలపాకుపై దీపం వెలిగించేటప్పుడు తమలపాకులను దేవుడి వైపు ఉంచి ముందుగా ప్రమిదలోకి తమలపాకు కాడ తుంచి వేయాలి. అనంతరం నువ్వుల నూనె వేసి ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది.అయితే ప్రతి రోజు ఉదయం ఈ విధంగా తమలపాకుపై దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.