ప్రపంచం మొత్తం సర్వనాశనం అయింది కేవలం చైనా వల్ల. చైనా అజాగ్రత్తతో నేడు ప్రపంచ దేశాలన్నీ కరనాతో అతలాకుతలం అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఉద్యోగాలు పోయాయి. వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. లక్షల మంది చనిపోయారు. కోట్ల మందికి కరోనా వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని నగరాలైతే షట్ డౌన్ అయ్యాయి. ఇలా ప్రపంచ దేశాలన్నీ ఎన్నడూ లేనంతగా నష్టాన్ని చవిచూశాయంటే దానికి కారణం చైనా దేశం.
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్.. మెల్లగా పాకుతూ ప్రపంచ దేశాలకు వ్యాపించింది. వెంటనే అన్ని దేశాలు లాక్ డౌన్ విధించడం, జాగ్రత్తలు పడటం, ఇమ్యూనిటీ పెంచుకోవడం లాంటివి చేసినప్పటికీ కరోనాను మాత్రం అడ్డుకోలేకపోయాయి.
ఇప్పటికీ బయటికి వెళ్తే ఖచ్చితంగా మాస్క్ వేసుకొని వెళ్లాలి. భారత్ లో మాస్క్ లేకుండా బయటికి వెళ్తే ఫైన్ వేస్తున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే ముందు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ప్రభుత్వం చెప్పినట్టుగా సోషల్ డిస్టెన్స్, మాస్క్ లు, శానిటైజర్లు వాడితే కొంతలో కొంత కరోనా వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు.
ఈసమయంలో.. కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. చైనా క్యాపిటల్ బీజింగ్ లో ఇక నుంచి మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ ప్రజలకు తెలిపింది. బయటికి వచ్చినా కూడా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు అని తెలిపింది.
దానికి కారణం ఏంటంటే.. గత 13 రోజుల నుంచి బీజింగ్ లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదట. దీంతో మనం కరోనాను జయించాం.. ఇక మనకు మాస్కులెందుకు.. మాస్కులు తీసేయండి… అన్నట్టుగా బీజింగ్ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకున్నదట.
అయితే.. ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. 13 రోజుల నుంచి ఒక్క కేసు కూడా నమోదు కానంత మాత్రాన అక్కడ కరోనా లేదని అనుకోవడం తప్పని.. ఇప్పుడు మాస్కులు తీసి ఇష్టమున్నట్టు తిరిగితే కరోనా మళ్లీ తిరగబెడుతుంది.. అది మళ్లీ ప్రపంచ దేశాలకు మరో తలనొప్పి.. అని ప్రపంచ వ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతున్నది.