ఏపీలో బీసీ కార్పొరేషన్స్ లొల్లి… అసల కథేంటి..?

cm jagan telugu rajyam

 అకాల వర్షాల మూలంగా వచ్చిన వరదలకు ఆంధ్ర రైతులు కోట్లు విలువ చేసే పంటలను కోల్పోయి గొల్లుమంటుంటే, వాళ్ళని పట్టించుకొనే సంగతి పక్కన పెట్టిమరి, వైసీపీ,టీడీపీ నేతలు ట్విటర్ వేదికగా, కుదిరితే ప్రెస్ మీట్ లు పెట్టి ఒకరిమీద మరొకరు దుమ్మెత్తిపోసుకునే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కలిపిస్తున్నారు.

cm jagan telugu rajyam

  దీనిపై టీడీపీ మాట్లాడుతూ మొదట 136 కార్పొరేషన్స్ అని చెప్పారు. ఇప్పుడేమో 56 కే పరిమితం చేశారు, పైగా ఎందులోనూ సరిగ్గా నిధులనేవి లేకుండా చేసి ఉత్తుత్తి కార్పొరేషన్స్ ఎందుకు..? నిధులు ఎక్కువగా వుండే పదవులన్నీ సొంత సామజిక వర్గానికి ఇచ్చుకొని, నిధులులేని పదవులను బీసీలకు ఇచ్చారంటూ మండిపడుతున్నారు. ఇటు వైసీపీ మాట్లాడుతూ బీసీలను అడ్డంపెట్టుకొని గెలిచి వాళ్ళని నిలువునా మించింది మీరు కదా..? మొదటి దశలో 56 కార్పొరేషన్స్ పెట్టాము, మిగిలిన వాటిని దశలవారీగా ఏర్పాటు చేస్తాం, బీసీలకు జరుగుతున్నా మేలు చూసి ఓర్వలేకనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రతి విమర్శలు చేస్తున్నారు.

 నిజానికి వైసీపీ వాదనలో తప్పు ఏమి కనిపించటం లేదు. 136 కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట వాస్తవమే, వాటిని దశల వారీగా పెంచే ఆలోచనలో ప్రభుత్వం వుంది. జగన్ ప్రవేశపెట్టే ప్రతి పథకం కూడా దశలవారీగా అమలులోకి వస్తుంది ఇది కూడా అలాగే, పైగా 50 శాతం రిజర్వేషన్స్ మహిళకు ఇవ్వటం మంచి విషయమే, గతంలో టీడీపీ బీసీలకు ఏమి చేసిందంటే గట్టిగా చెప్పుకోవటానికి ఒక్క మంచిపని కూడా కనిపించటం లేదు. ఇక నిధులు విషయం అంటారా.. ప్రస్తుతానికి రాష్ట్రము అప్పుల ఊబిలో వుంది, అయినా కానీ ఎక్కడ కూడా సంక్షేమ పధకాలు ఆగిపోలేదు.

  కరోనా సమయంలో జగన్ ప్రభుత్వం ఖర్చుకు ఎక్కడ వెనకడుగు వేయకుండా వైద్య సేవలు అందించింది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు వున్నాయి, అందుకే ప్రస్తుతానికి తగ్గట్లు నిధులు కేటాయించి మెల్ల మెల్లగా నిధులు పెంచే ఆలోచనలో ప్రభుత్వం వుంది. గతంలో టీడీపీ చేసినట్లు అంగుఆర్బాటాలతో మొదలెట్టి, మధ్యలో వదిలేసి అలవాటు సీఎం జగన్ కు లేదు.. అందుకే ఒక సృష్టమైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నాడు. ఇకనైనా నిజానిజాలు అర్ధం చేసుకొని మాట్లాడితే టీడీపీ నేతలకు ఇప్పుడున్న కొద్దిపాటి గౌరవమైన మిగులుతుంది.