బార్బీ గాళ్‌కీ ఐశ్వర్యా రాయ్‌కీ సంబంధం ఏంటో తెలుసా.?

అందానికి ప్రతిరూపం ఆమె రూపం. అందుకే ఆమె పేరుతో ఓ అందమైన పువ్వుల వనమే ఉంది. నీలి కళ్ల సుందరి, కుర్రకారుకు అందాల ఆరాధ్య దేవత, అందానికే కేరాఫ్ అడ్రస్ అయిన ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాయ్. ఆమె పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఈ అందాల రాశికి సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ పోటెత్తుతున్నాయి.

డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన కొంతమంది సెలబ్రిటీల లిస్టులో అందాల రాశి ఐశ్వర్యా రాయ్ పేరు కూడా ఉంది. డాక్టర్ కావాలనుకున్న ఐష్, మోడలింగ్ రంగం వైపు అనుకోకుండా ఎట్రాక్ట్ అయ్యింది. మిస్ ఇండియా కిరీటం ఎలాంటి మొహమాటం లేకుండా ఆమెను వరించేసింది. అలా సినిమాల్లోకి వచ్చింది. సినిమా తెరే ఆమె అందానికి ముగ్ధురాలయ్యింది. ప్రపంచం మొత్తం ఆ అందానికి దాసోహం అయ్యింది.

ఐశ్వర్యా రాయ్ నటించిన ‘జోధా అక్బర్’ సినిమాలోని ఆమె అందం, ఆహార్యాన్ని కాన్సెప్ట్‌గా తీసుకుని, బ్రిటన్ వారు బార్బీ బొమ్మలను తయారు చేశారట. మార్కెట్‌లోకి రాగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. తెలిసిందేగా, ప్రపంచం మొత్తం బార్బీ బొమ్మలకున్న క్రేజ్, కాస్ట్ ఏ పాటిదో.

అందాల రాశి ఐశ్వర్యారాయ్ అందం నుంచే పుట్టాయి కదా.. మరి, ఆ మాత్రం విలువ ఉండాల్సిందే. అన్నట్లు నెదర్లాండ్స్‌లోని ఓ తులిప్ గార్డెన్‌లో ఐశ్వర్యా రాయ్ మీద అభిమానంతో ఓ తులిప్ పువ్వుకు ఆమె పేరునే పెట్టి పెద్ద తోటలా పెంచేశారట. అదీ ఐష్ అందం గొప్పతనం.