బ్యాంకు కస్టమర్లు అలర్ట్ ….ఫిబ్రవరి నెలలో 10 రోజుల పాటు బ్యాంక్ సేవలు బంద్..?

కొత్త సంవత్సరంలో జనవరి నెల ముగింపు దశలో ఉంది. ప్రతి నెల బ్యాంకు సెలవులు ఉంటాయి. అయితే పండగల కారణంగా లేదా ఇతర ఇతర కారణాల వలన కొన్ని నెలలలో ఎక్కువ సెలవలు ఉంటాయి. ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయని తెలుసుకుందాం.

బ్యాంక్ సెలవులనేవి రాష్ట్రాల ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. నేషనల్ హాలిడేస్ రోజున అన్ని బ్యాంకులు అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా ఉంటాయి. ఫిబ్రవరి నెలలో ఆర్బీఐ ప్రకటించిన సెలవులను ఒక్కసారి పరిశీలిద్దాం. ఫిబ్రవరిలో ఏకంగా 10 రోజులు పాటు బ్యాంకులు మూతపడతాయి. ఈ సెలవులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ సెలవులు దేశంలోని వివిధ రాష్ట్రాలలో అమలవుతాయి. ఇందులో మహాశివరాత్రి తో పాటు ఆదివారాలు, శనివారాలు ఉన్నాయి. ఆ లిస్ట్ ఒక సారి పరిశీలిద్ధాం….

ఫిబ్రవరి 5-ఆదివారం

ఫిబ్రవరి 11 – రెండో శనివారం

ఫిబ్రవరి 12 – ఆదివారం

ఫిబ్రవరి 15 – లుఇ-నగై-ని పండుగ (మణిపాల్)

ఫిబ్రవరి 18 – మహాశివరాత్రి

ఫిబ్రవరి 19 – ఆదివారం

ఫిబ్రవరి 20 – మిజోరం రాష్ట్ర దినోత్సవం

ఫిబ్రవరి 21 – లోసార్ పండుగ

ఫిబ్రవరి 25 – నాలుగో శనివారం

ఫిబ్రవరి 26 – ఆదివారం

అయితే బ్యాంక్ సెలవు ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంక్ సెలవు ఉన్నా కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. యూపే సేవలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు. ఫిబ్రవరి నెలలోని 28 రోజులలో 10 రోజులు బ్యాంక్ సెలవలు ఉన్నాయి, కేవలం 18 రోజులు మాత్రమే పని దినాలు ఉన్నాయి. ముఖ్యమైన బ్యాంకు పనులు ఉన్నవారు ముందే వారి బ్యాంక్ పనులు చేసుకోవడం మంచిది.