ఊహించని ట్రీట్మెంట్ తో ఆసక్తిగా “బంగార్రాజు” టీజర్.!

అక్కినేని కుటుంబం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ సినిమా “బంగార్రాజు”. ఆల్రెడీ ఈ ఏడాది ఇద్దరు అక్కినేని హీరోలు అఖిల్ అక్కినేని మరియు నాగ చైతన్య లు తమ సినిమాలు ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్”, “లవ్ స్టోరీ” లతో సాలిడ్ హిట్స్ కొట్టి గాడిలో పడ్డారు. ఇక వారి తండ్రి అక్కినేని నాగార్జున సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాల్సి ఉంది.

మరి ఇది తన నయా సినిమా “బంగార్రాజు”తో వచ్చేయనుంది అని అర్ధం అవుతుంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం సోగ్గాడే చిన్ని నాయన కి సీక్వెల్ లా వస్తుంది. ఇక ఈరోజు చైతు బర్త్ డే కానుకగా చిత్ర బృందం అదిరే టీజర్ కట్ ని రిలీజ్ చేసారు.

లాస్ట్ టైం నాగ్ సోగ్గాడే లో ఎలాంటి మ్యాజిక్ చేసాడో సేమ్ అదే సీన్స్ ని నాగ చైతన్యతో ఊహించని ట్రీట్మెంట్ రిపీట్ చెయ్యడం ఆసక్తిగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంకా ఈ విజువల్స్ అయితే అక్కినేని ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే..