తెలంగాణలో బీజేపీ పార్టీలో ఎవరైనా ఫైర్ బ్రాండ్ ఉన్నారా? అంటే టక్కున చెప్పే పేరు బండి సంజయ్. అవును.. బండి సంజయ్ ఒక్కసారి మైకును పట్టుకున్నారంటే ఎవ్వరినీ వదలరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా విమర్శించే సత్తా ఉన్న నాయకుడు. ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా అయ్యారో లేదో.. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేశారు. వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ తెలంగాణలో బీజేపీ సత్తాను చాటారు. అందుకే.. ప్రస్తుతం తెలంగాణలో బండి సంజయ్ కి అంత క్రేజ్. ఆయన ఏది మాట్లాడినా.. అది వైరల్ అవ్వాల్సిందే.
తాజాగా రైతుల గురించి మాట్లాడిన బండి సంజయ్.. తెలంగాణ రైతులంతా ప్రధాని మోదీ వెంటనే ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్కడా అన్నదాతలు ఆందోళన చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేయకపోతే.. ఎందుకు తెలంగాణ రైతన్నలు ఆందోళన చేయడం లేదు. ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా రాజకీయాలు.. అంటూ బండి మండిపడ్డారు.
వర్షాలు వస్తే టీఆర్ఎస్ నేతలు రారు. రైతులు నష్టపోతే టీఆర్ఎస్ నేతలు రారు. వరదలు వస్తే రారు. కానీ.. రైతులపై తమ ప్రేమ ఉన్నదంటూ తెగ నటిస్తుంటారు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ మాటలు విని రైతులంతా సన్నాలు పండిస్తే.. ఇప్పుడు ఒక్క రైతును కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదేనా టీఆర్ఎస్ పాలన. ఇలాగే ఉంటుందా? సీఎ కేసీఆర్.. తను పండించిన పంటను ఎక్కడ అమ్ముతున్నారు. కొనుగోలు సెంటర్లలోనా లేక కార్పొరేట్ కంపెనీలకా? చెప్పాలి అంటూ బండి సంజయ్ నిలదీశారు.