గత రెండు రోజులు నుండి ఎక్కడ చూసిన గీతం యూనివర్సిటీకి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, దీనిపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటం , వాటిని అధికార పక్షము తిప్పికొట్టటం లాంటివి చేస్తూ, గీతం విషయాన్నీ ఇప్పుడు పూర్తిగా రాజకీయ రంగు పులిమేశారు. ఇంత జరుగుతున్నా కానీ గీతం యూనివర్సిటీ ఛైర్మన్ , బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ మాత్రం ఒక్క మాట కూడా బయటకు వచ్చి మాట్లాడకపోవటం విశేషం.
చంద్రబాబు దగ్గర నుండి టీడీపీ లోని ప్రముఖ నేతలు దీనిపై స్పందించిన కానీ భరత్ మాత్రం ఎక్కడ కనపడలేదు. తాజాగా వస్తున్నా సమాచారం ప్రకారం భరత్ చంద్రబాబు మీద కోపంతో ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో ప్రతిపక్షములో ఉన్నప్పుడు పార్టీ అవసరాల కోసం సహాయం అందించిన గీతం యాజమాన్యం, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 40 ఎకరాలను క్రమబద్దీకరణ చేయాలనీ ఫైల్ పంపించిన బాబు దానిని బుట్టదాఖలాలు చేయటంతో ఆ సమస్య అలాగే ఉండిపోయింది . అప్పట్లో చంద్రబాబు దీనిపై ఒక నిర్ణయం తీసుకోని ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదని, అప్పట్లో బాబు చేసిన తప్పు వలనే తాము ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని భావించిన భరత్ బాబు అండ్ కో పై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది.
ఇదే సమయంలో తాను కూడా బయటకు వచ్చి మాట్లాడితే సమస్య తగ్గకపోగా, మరింత జఠిలమయ్యే అవకాశం కూడా ఉండటంతో భరత్ మౌనం వహిస్తున్నాడని తెలుస్తుంది. గతంలో గీతం వ్యవస్థాపకుడు మూర్తి గారితో బాబుకు మంచి సంబంధాలు ఉండేవి, టీడీపీ తరుపున రెండుసార్లు ఎంపీ గా పనిచేసిన అనుభవం ఉంది, టీడీపీకి విశాఖలో పట్టుకొమ్మ లాంటి వ్యక్తిగా మూర్తి ఉండేవాడు. అలాంటి వ్యక్తి తన భూముల విషయంలో చంద్రబాబు ను అనేక సార్లు వేడుకున్న కానీ బాబు వాటిని పట్టించుకోలేదు సరికదా ఆ భూములకు ఎంతో కొంత రేట్ ఫిక్స్ చేసి, ఆ మొత్తం చెల్లించి తీసుకోమని చెప్పటం కానీ, లేదా క్రమబద్దీకరించటం కానీ చేయకుండా అవతల వాళ్ళని ఒక సంకటక స్థితిలో ఉంచటం చూస్తే బాబు యొక్క నైజం ఏమిటో అర్ధం అవుతుంది