ఉక్కు నగరం విశాఖపట్ణం అభివృద్ది దిశగా జగన్ సర్కార్ ముందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే. త్వరలో విశాఖ పరిపాలనా రాజధానిగా అవతరించబోతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పెట్టుబడులన్నీ ఉక్కు నగరంలోనే పెడతారన్నది వాస్తవం. ఇక సినిమా పరిశ్రమ ఇదే నగరంలో డెవలప్ చేయాలని టాలీవుడ్ పెద్దలు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడే విశాఖను అన్ని రకాలుగా అభివృద్ది చేయాలని, సినిమా పరిశ్రమ అభివృద్దిలో భాగంగా 300 ఎకరాలు కేటాయించడం జరిగింది. మొత్తంగా 300 ఎకరాలు వైఎస్ హయంలోనే కేటాయించినట్లు లెక్కలో ఉంది. అటుపై టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమ అభివృద్ది మరుగున పడిపోయింది.
కొత్త రాష్ర్టం ఏర్పాటు కావడంతో చంద్రబాబు ప్రభుత్వం అమరావతి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసారు తప్ప..విశాఖని పట్టించుకు న్నది లేదు. ఇక చిత్ర పరిశ్రమ కి వైజాగ్ కి అనుకూలమైన వాతావరణం అని చంద్రబాబు కేవలం మాటలకే పరిమితం చేసారు తప్ప! పనుల పరంగా ఒక్క అడుగు కూడా మందుకు వేయలేదు. అయితే అక్కడ పరిశ్రమ పేరు చెప్పి భూములు కేటాయింపు అయితే జరిగింది. దీనిలో భాగంగా 160 ఎకరాల భూమిని డెవలెప్ మెంట్ కు సంబంధించి హిందుపురం ఎమ్మల్యే బాలకృష్ణకు చేతుల్లో పెట్టినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. సినిమాల పరంగా బాలయ్యకు ఉన్న పరిచయాలతో సులభంగా డెవలప్ చేయగల రు అన్న నమ్మకంతో బాబు ఆ పని చేసారని ప్రచారంలోకి వచ్చింది.
కానీ అక్కడ ఎలాంటి అభివృద్దికి నోచుకోలేదు. ఈలోపు ఎన్నికలు రావడం జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ మారిపోయింది. జగన్ ఇప్పుడు విశాఖని ముంబై తరహాలో మరో వాణిజ్య రాజధానిగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా టాలీవుడ్ కు పెద్ద ఎత్తున భూములు కేటాయించాలని రంగం సిద్దం చేస్తున్నారు. దీంతో అప్పుడు బాలయ్య చేతుల్లో చంద్రబాబు పెట్టిన భూముల వివరాలపై జగన్ ఆరాతీసే అవకాశం ఉంది. వాటన్నింటిని ప్రభుత్వం అధీనంలోకి తీసుకుని అభివృద్ది కోసం ముందుకొచ్చే సినీ దిగ్గజలాకి ప్రోత్సాహకాల రూపంలో ప్రకటించాల్సి ఉంది. మంగళవారం సినీ పెద్దలతో జరిగిన భేటీలో 300 ఎకరాల భూముల విషయంపై అధికారులతో చర్చిస్తామని సీఎం వెల్లడించిన సంగతి తెలిసిందే. విశాఖలో జగన్ సర్కార్ భూ కుంభకోణానికి పాల్పిడిందంటూ ఆరోపణలు చేస్తోన్న చంద్రబాబు అండ్ కో ఇప్పుడు ఆ 300 ఎకరాలకు సంబంధించి సెంటు భూమి కూడా లెక్క తగ్గకుండా వివరాలు సమర్పించాల్సి ఉంది.