ఇన్సైడ్ టాక్ : “NBK 107” కొత్త టైటిల్ బాలయ్యకి నచ్చలేదా?

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర మంచి హైప్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరో చిత్రాల్లో నందమూరి నటసింహ నందమూరి బాలయ్య నటిస్తున్న సినిమా కూడా ఒకటి. తన కెరీర్ లో అఖండ లాంటి భారీ హిట్ తర్వాత 107వ ప్రాజెక్ట్ గా ఈ సినిమాని చేస్తుండగా దర్శకుడు గోపీచంద్ మలినేని అయితే దీనిని తెరకెక్కిస్తున్నారు.

అయితే ఇప్పుడు షూటింగ్ అంతా మంచి ఫాస్ట్ గా జరుగుతుండగా ఈ దీపావళి కానుకగా అయితే చిత్రం టీజర్ ని అలాగే అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న టైటిల్ పై కూడా క్లారిటీ రానుంది. అయితే దీనిపై ఆల్రెడీ కొన్ని పవర్ ఫుల్ టైటిల్స్ ని పరిగణలో తీసుకోగా వాటిలో అయితే బాలయ్యకి ఏది నచ్చడం లేదని ఇన్సైడ్ టాక్.

ఆల్రెడీ అన్నగారు, రెడ్డి గారు లాంటి టైటిల్స్ ఉండగా మేకర్స్ అయితే “రెడ్డి గారు” ఫిక్స్ చేద్దామా అని బాలయ్యని అడిగితె అది తనకి నచ్చలేదని బాలయ్య చెప్పారట. దీనితో ఇప్పుడు మరో టైటిల్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం ఇస్తున్నాడు.