తేదాపా నుంచి ఆరేడుగురు ఎమ్మెల్యేలు వైకాపా కండువా కప్పుకోవడానికి సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో దక్షిణాకొస్తా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పటికే ముహుర్తం కూడా పెట్టుకున్నట్లు సమాచారం. రేపో మాపో సైకిల్ దిగి ప్యాన్ కిందకు రానున్నారు. వాస్తవానికి మహానాడు కల్లా వైసీపీ వాళ్లిద్దర్నీ లాగేసి షాక్ ఇవ్వాలని ప్లాన్ చేసింది. కానీ మూలిగే నక్కపై తాటి పండు దేనికని ప్రస్తుతానికి ఆకర్ష్ ని వాయిదా వేసింది. అయితే వెనకెనుక జరగాల్సిన వన్నీ జరిగిపోతున్నాయి. ఓ ఏడుగురు ఎమ్మేల్యేలను లాగితే టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది. అటుపై అసెంబ్లీ లో చోద్యం చూడటం తప్ప చేసేదేమి ఉండదు.
వైసీపీ ఈ సన్నివేశం కోసం కాచుకుని కూర్చుకుంది. చంద్రబాబుకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా షాకివ్వడానికి రెడీ అవుతోంది. అదే జరిగితే తేదాపా గాల్లో కలిసిపోయినట్లే. ఈ ఈ విషయం గ్రహించిన అదిష్టానం ఎలాగైనా ఉన్న ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవాలని ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. జంపింగ్ కు సిద్దంగా ఉన్న ఎమ్మెల్యేలను గుర్తించి భారీగా ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం వేడెక్కుతోంది. ప్యాకేజీ ఎరతో ఎలాగైనా వెళ్లిపోవాలనుకున్న వారందన్నీ ఆపాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోందిట. మహానాడు ఘట్టం కూడా పూర్తయింది కాబట్టి చంద్రబాబు ఇప్పుడు ఆ పనుల్లోనే బిజీ అయినట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే ఈ జంపింగ్ విషయాన్ని హిందుపురం తేదాపా ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్తే జంపింగ్ నిజమే అన్నట్లు తల ఊపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చివరి ప్రశ్నగా ఎమ్మేల్యేల జంపింగ్ గురించి పాత్రికేయలు అడిగారు. దానికి బధలుగా బాలయ్య ఏదో సమాధానం చెప్పబోతుంటే ఇది రాజకీయా వేదిక కాదని…. ఆసందర్భం వచ్చినట్లు తప్పకుండా మాట్లాడుతారని పక్కనున్న వాళ్లు సలహా ఇవ్వడంతో బాలయ్య వెనక్కి తగ్గారు. లేదంటే ఆ వేడిలో జంపింగ్ ఎమ్మెల్యేల గుట్టు కూడా బాలయ్య చెప్పేసేవారని పొలిటికల్ మీడియాలో చర్చకొచ్చింది.