Balakrishna: బాలకృష్ణ తన కూతురిగా పెళ్లిసందD హీరోయిన్… ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

Balakrishna: అఖండ మూవీతో థియేటర్స్ లో రచ్చ చేసిన బాలయ్య OTT ప్లాటుఫారంలోను అన్ స్టాపబుల్ షోతో బాలయ్య ఎనర్జీ అన్ స్టాపబుల్ అనిపించుకున్నాడు. వరుస సినిమాలను లైన్ లో పెట్టి కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో యాక్షన్ ప్యాకెడ్ సినిమా చేస్తుండగా ఎఫ్ 2 సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా ఒక సినిమా కు కమిట్ అయ్యాడు. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉండగా బాలయ్య గోపీచంద్ సినిమా తో బిజీగా ఉన్నాడు. అయితే గోపీచంద్ ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ఈ సినిమా తండ్రి కూతుర్ల చుట్టూ సాగే కథగా తెలుస్తోంది. ఇందులో తండ్రి పాత్రలో బాలయ్య బాబు నటిస్తుండగా కూతురు క్యారెక్టర్ లో పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలాను అనుకుంటున్నారు. అయితే శ్రీలీలాను కూతురి క్యారెక్టర్ లో బాలయ్య ఒప్పుకుంటాడో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఇక శ్రీలీలాకు పెళ్లి సందD ఫిల్మ్ తో బాగా పేరు వచ్చింది. తన డాన్స్ తో క్యూట్ నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టి హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. అయితే ఈ అమ్మడికి చాలా సినిమాల్లో సిస్టర్ రోల్స్ వచ్చినా చేయడానికి ఇంట్రస్ట్ చూపించలేదు.

మరీ ఇపుడు నందమూరి నటసింహం పక్కన కూతురి గా నటించడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.అయితే ముందుగా ఈ పాత్రలు చేయడం కోసం సాయి పల్లవి ని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి అయితే ఈ విషయం గురించి ఏమాత్రం క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం ఈ పాత్రలో శ్రీలీలాను చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మరి బాలయ్య కూతురు గా నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఒప్పుకుంటారో లేదో తెలియాల్సి ఉంది.