2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో మొదలైన టీడీపీ బ్యాడ్ టైం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ ఎన్నికల్లో ఉహించని ఫలితాలు వచ్చిన తరువాత పార్టీలు కీలక నేతలు కషాయం కండవాతోపాటు కొందరు అధికార పార్టికిలోకి జంప్ అయ్యారు. అయితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు పంచాయితీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని మరింత కుదేలు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా పార్టీ అధినేత జిల్లాలో కూడా ఘోరమైన ఫలితాలు రావడంతో దిక్కతోచని స్థితిలో ఉన్నారు పార్టీలోని కీలక నేతలు.
2019 ఎన్నికల్లో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 13 వైసీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు పోటీ చేసిన కుప్పంలో కూడా మొదటి రెండు రౌండ్లు లో బాబు వెనుకంజలోనే ఉన్నారు ఎలాగోలా చచ్చిచెడి అక్కడ గెలవడంతో కేడర్ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే తాజగా పంచాయితీ ఎన్నికల్లో కూడా ఘోరమైన ఫలితాలనే మూటకట్టుకుంది పార్టీ జిల్లా వ్యాప్తంగా దాదాపు 80శాతానికి పైగా పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. బాబు సొంత గ్రామం నారావారి పల్లె ఉన్న కందులవారిపల్లె పంచాయతీలో కూడా వైసీపీ గట్టి పోటీ ఇవ్వడంతో అక్కడ కేవలం 500 ఓట్లతో టీడీపీ గెలుపొందింది.
ఈ నేపధ్యంలో తాజా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలాంటి చేదు అనుభావాలను మిగుల్చుతాయో అనే బెంగ ఇప్పుడు కేడర్ లో నే కాకుండా కీలక నేతల్లో కూడా ఎక్కవగా కనిపిస్తోందని పార్టీ శ్రేణుల సమాచారం. మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే చిత్తూరులో 50 డివిజెన్లు ఉంటే 37 ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతిలో 50 డివిజెన్లులకుగాను 27 డివిజన్లులో అధికాపార్టీ అభ్యర్ధలు ఏకగ్రీవంగా నిలిచారు. అయితే పోటీ జరిగిన 28 డివిజన్లలో కూడా వైసీపీ 15 డివిజన్లులో బలంగా ఉన్నట్లు సమాచారం. పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన చేదు ఫలితాలు తరువాత బాబు చిత్తూరు జిల్లా పర్యటన చేసినప్పటికి కేడర్ లో ఎటువంటి మార్పు కనిపించలేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మున్సిపల్ , కర్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైన ఒక మున్సిపాలిటి రెండు కర్పొరేషన్లు గెలుచుకోవాలని భావించిన తెలుగు తమ్ముళ్లుకు అది సాధ్యం కాలేదు.