Chicken: చికెన్ ప్రియులకు చేదు వార్త.. ఎందుకంటే?

ఏ సీజన్ అయినా చికెన్ తినడానికి వెనుకాడరు చికెన్ ప్రియులు. తినే సందర్భం లేకున్నా కూడా వండుకొని మరి తింటుంటారు. ఇక ధరలు పెరిగిన కూడా కొందరు మాత్రం తినకుండా ఉండలేరు. ఇక ఆదివారం వస్తే చాలు అందరి ఇంట్లో ముక్క ఉడకాల్సిందే. కానీ ఈ ఆదివారం చికెన్ ప్రియులు చేదు వార్త వినాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ లో చికెన్ ధర అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.

గత కొన్ని రోజులుగా నిత్యావసరాల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే వంట నూనెలు, పప్పు ధరలు కూడా పెరిగాయి. అంతలోనే నాన్ వెజ్ ధరలు కూడా పెరిగి షాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఒక కేజీ చికెన్ ధర ఈరోజు రూ.300 లకు పైగా చేరుకుంది. ఇక చికెన్ ప్రియులు అంత కాకుండా కొద్ది మోతాదులో తీసుకొని తృప్తి చెందుతున్నారు.