ఇది వెన్నుపోటుల‌కే వెన్నుపోటు-ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి చంద్ర‌బాబు పొలిక‌ల్ చావుదెబ్బ‌!

abn rk losing journalistic values in kothapaluku
టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుయుక్తులు ప‌న్న‌డంలో, ఎత్తుకుపైఎత్తులు వేడ‌యంలో, వ్యూహాలు ప‌న్న‌డంలో, వెన్నుపోటు పోడ‌వ‌డాలు  గురించి  తెలియంది ఎవ‌రికి. వాటిలో ఆరితేరిన ఘ‌నాపాటి అన‌డానికి ఎన్నో ఉద‌హ‌ర‌ణ‌లున్నాయి. గొప్ప మేథావి కాబ‌ట్టే మూడు సార్లు సీఎం అవ్వ‌గ‌లిగాడు. అందితే జుట్టు..అంద‌క‌పోతే కాళ్లు ప‌ట్టుకుని రాజ‌కీయాలు చేయ‌డం చంద్ర‌బాబుకు తెలిసినంత‌గా మ‌రో నేత‌కు తెలియ‌దేమో! అందుకే చంద్ర‌బాబుని పొలిటిక‌ల్ సినారేలో డౌన్ టు ఎర్త్ అని అంటారు. ఇక్క‌డ గెల‌వ‌డం ముఖ్యం. గెలుపు ఎలా గెలిచార‌న్న‌ది ముఖ్యం కాదు.
Pawan Kalyan
Pawan Kalyan


యుద్ధం చేత‌గాని వాడే ధ‌ర్మం గురించి మాట్లాడుతాడ‌ని మ‌హేష్ బాబు చెప్పిన డైలాగ్ చంద్ర‌బాబు అవ‌పోసాన ప‌ట్టేసి ప‌నిచేస్తారు అన‌డానికి నాలుగు ద‌శాబ్ధాల రాజ‌కీయ అనుభ‌వ‌మే ఓ పెద్ద పాఠం. చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచారా? ఇంకెక్క‌డైనా పొడిచారా?  బీజేపీ మ‌ద్ద‌తుతో గెలిచారా? జ‌న‌సేన  అండ‌తో అధికారంలోకి వ‌చ్చారా? అన్న‌ది ప‌క్క‌న‌బెడితే ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ముందున్న మెయిన్  టార్గెట్  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్ట‌డం. అందుకోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తారు. 70 ఏళ్లు దాటిన త‌ర్వాత  కూడా చంద్రబాబు బుర్ర  షార్ప్ గా ప‌నిచేస్తుంది అన‌డానికి ఉదాహ‌ర‌ణే ఏడాది కాలంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ముప్పు తిప్ప‌లు పెట్ట‌డం.

 

కాబ‌ట్టి చంద్ర‌బాబుని పొలిక‌ల్ గా అంచ‌నా వేయ‌డం అన్న‌ది అంత ఈజీ కాదు. ఇక ఏపీలో అన్న‌ద‌మ్ముల్లా క‌లిసి పనిచేస్తున్న బీజేపీ నుంచి జ‌న‌సేన‌ను వేరు చేయ‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. అందులో వాస్త‌వం ఏంటో తెలియ‌దు గానీ ఆ రెండు పార్టీలు క‌లిసి ఉంటే మాత్రం టీడీపీకే కాదు…వైకాపాకు ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్లే. బీసీల త‌ర్వాత అత్య‌ధిక ఓటు బ్యాంక్ క‌ల్గినది అదే వ‌ర్గం. బీజేపీ ఆ అండ చూసుకునే జ‌న‌సేన‌ని మిత్ర‌ప‌క్షం చేసుకుంది. ఇక చంద్ర‌బాబు బీసీల అండ‌తో రాజ్యాధికారం చేప‌ట్టిన చ‌రిత్ర ఆయ‌న సొంతం. చంద్ర‌బాబు బీసీల ప‌క్ష‌పాతిగా ఖ్యాతికెక్కారు.  కాబ‌ట్టి ఆ రెండు పార్టీల‌ను చంద్ర‌బాబు చీల్చినా చీల్చొచ్చు.