ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు అంటే ఒకటికి పదిసార్లు అలోచించి చెప్పాల్సిన పరిస్థితిలో ప్రతి ఆంధ్రుడు ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన 1953 అక్టోబర్ 1 కానీ, ఉమ్మడి ఏపీ ఏర్పడిన నవంబర్ 1 కానీ ఎదో ఒక రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చేయాలనీ అనేక మంది మేధావులు కోరారు, కానీ చంద్రబాబు 2014 లో అధికారంలోకి వచ్చిన నాటి మొన్నటి ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చవిచూసి పదవి నుండి దిగిపోయే వరకు జూన్ 2 న నవ నిర్మాణ దీక్షలు అంటూ వారం రోజులు కార్యక్రమాలు నిర్వహించేవాడు. అలాంటి అద్భుతమైన సలహా ఎవరిచ్చారో కానీ, దానంత అర్ధం పర్థం లేని కార్యక్రమం మరొకటి లేదని చెప్పవచ్చు.
ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మాత్రం నవంబర్ 1 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలోనే నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటిస్తానని మాటిచ్చాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించాడు, జిల్లా స్థాయిలో మంత్రులు, అధికారులు స్వయంగా పాల్గొని వాటిని విజయవంతం చేశారు, కానీ ప్రతిపక్ష పార్టీ మాత్రం ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించలేదు, చివరికి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు గా చెప్పుకొనే చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా నిర్వహించిన దాఖలాలు లేవు, కనీసం జూమ్ సమావేశాల్లో కూడా పొట్టి శ్రీరాములకు నివాళులు కూడా అర్పించినట్లు కూడా వార్తలు రాలేదు.
తాము చేయని పనిని జగన్ సర్కార్ చేసిందనే అక్కసుతోనే ప్రధాన ప్రతిపక్షం ఈ వేడుకలకు దూరంగా ఉండిపోతే, అది ముమ్మాటికీ తప్పే, తమ సొంత లాభాల కోసం, రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట కు నష్టం కలిగించే చర్యలు ఎవరు చేసిన తప్పు పట్టాల్సిందే, ఈ వేడుకలు అనేవి జగన్ ఏమి కొత్తగా ప్రవేశ పెట్టటంతో, లేక రాజశేఖర్ రెడ్డి గుర్తుగానో చేయటం లేదు. దాదాపు ఐదారు దశాబ్దాల నుండి వస్తున్నా సంప్రదాయమే అది, మధ్యలో టీడీపీ ప్రభుత్వం తలకుమాసిన నవ నిర్మాణ దీక్షలంటూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలను బంద్ చేసింది, తిరిగి జగన్ వాటిని కొనసాగిస్తున్నాడు కాబ్బటి తాము కూడా ఈ వేడుకలు నిర్వహిస్తే తాము గతంలో చేసిన తప్పును మరోసారి తట్టి లేపుకున్నట్లు అవుతుందని భావించిన బాబు ఈ విషయంలో పిన్ డ్రాప్ సైలెన్స్ అయినట్లు తెలుస్తుంది, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అవతరణను చిన్నచూపు చూడటం బాధాకరం.
కనీసం మీడియాలో కూడా దీనిపై పెద్దగా వార్తలు కూడా రాలేదు, ఇక సోషల్ మీడియాలో రాష్ట్ర అవతరణ గురించి మాట్లాడిన ఒక్క పెద్ద సెలెబ్రిటీ కూడా లేకపోవటం దారుణం, అదే తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు, పోటీపడి మరి ట్విట్ల వర్షం కురిపించిన టాలీవుడ్ ప్రముఖులు నేడు తమకేమి సంబంధం లేన్నట్లు సైలెంట్ అయిపోయారు. స్టూడియో కు కట్టుకోవటానికి భూములు, సినిమా టిక్కెట్లు అధిక రేటుకు అమ్ముకోవటానికి అనుమతుల కోసమే ఆంధ్ర గుర్తుకు వస్తుంది తప్పితే, మిగతా సమయంలో సోదిలో కూడా ఉండదేమో మన సినీ తారలకు…