మరోసారి దేవి నాగవల్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు గోగినేని..!

దేవి నాగవల్లి విశ్వక్ సేన్ విషయంలో జరిగిన వివాదం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఒక హీరోని గెటవుట్ అంటూ అనడంతో ఎంతోమంది హీరో విశ్వక్ సేన్ కి మద్దతుగా నిలబడి యాంకర్ దేవి నాగవల్లి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మానవ హక్కుల సంఘం కార్యకర్త బాబు గోగినేని ఇదివరకే వీరి వ్యవహారం పై స్పందించి తప్పొప్పుల గురించి మాట్లాడారు.ఈ క్రమంలోనే బాబు గోగినేని మరోసారి వీరి వ్యవహారం పై స్పందించి యాంకర్ దేవి నాగవల్లి గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

ఈ క్రమంలోని దేవి నాగవల్లికి సంబంధించిన పాత వీడియోలను బయటకు తీస్తూ ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దేవి నాగవల్లి రోడ్డుపై చిందులు వేస్తూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేసి బాబు గోగినేని తనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వక్ సేన్ రోడ్డుపై ప్రాంక్ వీడియో చేశాడని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కదా? మరి రోడ్డుపై నువ్వు చేసింది ఏంటి?ఈ విధంగా రోడ్లపై ఫ్రాన్స్ వీడియోలు చూస్తూ పిచ్చిపిచ్చిగా గంతులు వేస్తూ ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతూ కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

మరి ఇక్కడ నువ్వు చేస్తున్నది పబ్లిక్ న్యూస్ కాదా? అంటూ బాబు గోగినేని దేవి నాగవల్లి పై విరుచుకుపడ్డారు. అలాగే గురుత్వాకర్షణ శక్తి గురించి దేవి నాగవల్లి మాట్లాడుతూ గతంలో చేసిన ఈ వీడియోని ఈ సందర్భంగా బయటపెడుతూ నీటిలో ఉన్న విద్యుత్ శక్తికి, భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తికి ఉన్న సంబంధాన్ని వివరిస్తున్న ఇటువంటి మానసిక వైద్య నిపుణురాలు అంటూ ఆమెపైకామెంట్లు చేశారు మొత్తానికి బాబు గోగినేని దేవి నాగవల్లి గురించి చేసిన ఈ కామెంట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.