టీడీపీ పార్టీలో అనేక మంది ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఉన్నారు . దాదాపు జిల్లాకు ఒకరిద్దరు ఉన్నారు . వీళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అయ్యన్న పాత్రుడు గురించి, టీడీపీ లో సీనియర్ నేతగా చలామణి అవుతున్న అయ్యన్న బూతులు తిట్టే విషయంలో కూడా తానే సీనియర్ అని నిరూపించుకున్నాడు. గీతం యూనివర్సిటి కాంపౌండ్ వాలును యూనివర్సిటి ప్రధాన ద్వారాన్ని రెవిన్యు అధికారులు కూల్చేసిన ఘటనపై అయ్యన్న మీడియా సమావేశం పెట్టారు.
ఆ సందర్భంగా ఆర్డీవో ఎంఆర్వోలను నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. వేలాదిమంది విద్యార్ధులకు చదువు చెబుతున్న యూనివర్సిటి కాంపౌండ్ వాల్ ను ప్రభుత్వం ఎలా కూల్చేస్తుందంటు పెద్ద లాజిక్ లాగారు. అర్ధరాత్రి వెళ్ళి కూల్చివేతలకు దిగిన రెవిన్యు సిబ్బందిని అమ్మనాబూతులు తిట్టారు. ఇలా అధికారులపై నోరు పారేసుకోవటం అయ్యన్నకు కొత్తేమి కాదులే,ఆమధ్య నర్సీపట్నం మున్సిపాల్ మహిళా కమీషనర్ ను పట్టుకుని అందరిముందు బట్టలూడదీసి తంతానంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దాంతో ఆమె అయ్యన్నపై కేసు పెట్టారు. పోలీసులు అరెస్టు చేయటానికి వస్తే పరారీ అయిపోయన చింతకాయల కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుని ప్రత్యక్షమయ్యారు. ఆ గతాన్ని మర్చిపోయాడో లేక , తెంపరితనం ఎక్కువయ్యిందో కానీ, మరోసారి అదే విధంగా అధికారులను దూషించాడు.
దీనిపై అటు అధికారులు ఇటు ప్రభుత్వ పెద్దలు కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో సీఎం జగన్ మీద అనేక విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు అయ్యన్న, దీనితో వైసీపీ దృష్టి అయ్యన్న మీద పడినట్లు సమాచారం, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నా వైసీపీ పెద్దలు, అయ్యన్న ఎక్కడైనా చిక్కకపోతాడా అంటూ అతన్ని ఓ కంట గమనిస్తూనే వున్నారని సమాచారం. ఇప్పటికే టీడీపీ లో పెద్ద గొంతు అచ్చెన్నాయుడు కు జైలు అంటే ఏమిటో రుచి చూపించారు, అయ్యన్న కు కూడా ఆ భాగ్యం త్వరలోనే కలిగే అవకాశం ఉందని వైసీపీ నేతలు చాటుమాటుగా అంటున్నారు. ఇప్పటికైనా నోటీ దురుసు తగ్గించుకుంటే మంచిది, లేకపోతే ఈ వయస్సులో కోర్టులు, జైళ్లు చుట్టూ తిరగాల్సివస్తుంది అయ్యన్న…..